Shalini Pandey: ‘అర్జున్‌ రెడ్డి’ నా బేబీ.. మిగతావేమీ పట్టించుకోలేదు: షాలినీ పాండే

నటి షాలినీ పాండే (Shalini Pandey) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘అర్జున్‌రెడ్డి’ (Arjun Reddy) సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. 

Published : 29 Nov 2023 19:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన సరికొత్త చిత్రం ‘యానిమల్‌’ (Animal) రిలీజ్‌ అవుతోన్న వేళ.. ప్రేక్షకులందరూ ఆయన గత చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy)ని గుర్తు చేసుకుంటున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ మేకింగ్‌, నటీనటుల గురించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ చిత్ర నటి షాలినీ పాండే (Shalini Pandey) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సినిమా తనకెంతో ఫేమ్ అందించిందన్నారు.

Pragathi: ఆర్థిక కష్టాలు.. కన్నీళ్లు.. నటి ప్రగతి ఇంత ‘స్ట్రాంగ్‌’గా ఉండటానికి కారణాలివే..!

‘‘అర్జున్‌రెడ్డి’కి సంతకం చేసినప్పుడు నా వయసు 21 ఏళ్లు. బయట ప్రపంచం గురించి తెలియని అమాయకురాలిని. ఒక నటిగా అదే నా తొలి అడుగు. నా కల నెరవేరినట్లు అనిపించింది. ఏదీ నాకు అంత పెద్ద విషయంలా అనిపించలేదు. ఈ సినిమా చిత్రీకరణను మేమంతా సరదాగా గడిపాం. ఆ సినిమా, అందులో నేను పోషించిన ప్రీతి పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది. అది నా బేబీ. ఎప్పటికీ నా హృదయంలో దానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నేను ఎన్నడూ ఊహించని ఫేమ్‌ ఆ సినిమాతో నా సొంతమైంది. ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఎలా తీసుకున్నారనే దానిపై నాకు ఏవిధమైన అభిప్రాయాల్లేవు. ఎందుకంటే, ఒక సినిమాపై తమ అభిప్రాయాన్ని వెల్లడించే స్వేచ్ఛ, హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’’ అని ఆమె చెప్పారు. ‘అర్జున్‌ రెడ్డి’ విడుదలై  ఇంత కాలమైనా ఇప్పటికీ తనని ప్రీతిగానే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు