Vanitha: వనితా విజయ్‌ కుమార్‌పై దాడి.. నటి పోస్టు వైరల్‌

తనపై ఓ వ్యక్తి దాడి చేసినట్లు నటి వనితా విజయ్‌ కుమార్‌ (Vanitha Vijaykumar) ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టారు.

Updated : 26 Nov 2023 15:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుర్తు తెలియని వ్యక్తి తనపై దాడి చేశాడంటూ నటి వనితా విజయ్‌కుమార్‌ (Vanitha VijayKumar) తెలిపారు. కమల్‌హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 7’లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్‌ మద్దతుదారుడే ఈ దాడికి పాల్పడి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

‘‘నిన్న రాత్రి నా సోదరి నివాసం నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఓ వ్యక్తి నాపై దాడి చేశాడు. నా ముఖంపై తీవ్రగాయం చేసి పారిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని నా సోదరి చెప్పింది. న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. అందుకే అలాంటి ప్రయత్నం చేయలేదు. ప్రథమ చికిత్స అనంతరం.. నాపై దాడి చేసిన వ్యక్తి గురించి ఆలోచించా. అతడి మాటలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ ప్రదీప్‌ ఆంటోనీ మద్దతు దారుడే ఈ దాడికి పాల్పడి ఉంటాడని నాకు అనిపిస్తోంది’’ అంటూ ఆమె ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ముఖానికి గాయం కావడంతో కొన్ని రోజుల పాటు తాను కెమెరా ముందుకు రావాలనుకోవడం లేదన్నారు.

‘నీకింతటి ధైర్యమెక్కడిది.. నువ్వు తప్పు చేస్తున్నావు’.. నిర్మాతపై సముద్రఖని ఫైర్‌

‘దేవి’తో తెలుగువారికి పరిచయమయ్యారు వనిత. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇటీవల ఆమె ‘మళ్ళీ పెళ్లి’తో అలరించారు. కోలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాలు, రియాల్టీ షోల్లోనూ ఆమె నటించారు. వనిత కుమార్తె జోవిక ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 7’ (తమిళం)లో కంటెస్టెంట్‌గా ఉన్నారు. ఆ రియాల్టీ షో, అందులోని హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వనిత తరచూ వీడియోలు షేర్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని