Maidaan: ఓటీటీలోకి ఎమోషనల్‌ స్పోర్ట్స్‌ డ్రామా.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..

అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మైదాన్‌’ ఓటీటీలోకి వచ్చేసింది.

Updated : 22 May 2024 10:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా అమిత్ శర్మ తెరకెక్కించిన చిత్రం ‘మైదాన్‌’ (Maidaan Movie). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పోర్ట్స్‌ డ్రామా సినీ ప్రియుల్ని మెప్పించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) ఇది అందుబాటులోకి వచ్చింది. బోనీ కపూర్, జీ 5 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ప్రియమణి, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ కీలకపాత్రలు పోషించారు.

‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

కథేంటంటే: అది 1952. హెల్సెంకీ ఒలింపిక్స్‌. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత ఫుట్‌బాల్‌ జట్టు, యుగోస్లేవియా చేతిలో ఘోరంగా ఓడిపోతుంది. ప్రత్యర్థి జట్టు ఏకంగా 10 గోల్స్‌ కొడుతుంది. సరైన బూట్లు కూడా లేని భారత ఆటగాళ్లు గాయాలపాలవుతారు. ఒలింపిక్స్‌లో భారత్‌ ఓటమిని ఎత్తి చూపుతూ పత్రికలు తీవ్ర విమర్శలు చేస్తాయి. ఈ క్రమంలో మన ఫుట్‌బాల్‌ జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాలనుకున్న కోచ్‌ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగణ్‌) (Ajay Devgn) ఆటగాళ్లకు ఎలా అండగా నిలబడ్డాడు? ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, జట్టును మళ్లీ ఎలా సిద్ధం చేశాడు? అనంతరం జరిగిన టోర్నమెంట్‌లలో ఎలా రాణించింది?  (Maidaan Movie on amazon) ఈ క్రమంలో సయ్యద్‌, ఆటగాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని