Vishnu Vishal: తుపాను ఎఫెక్ట్‌.. సాయం కోరిన హీరో.. స్పందించిన రెస్క్యూ విభాగం

తాను నివాసం ఉండే ప్రాంతం నీట మునిగిందని, సాయం కోసం ఎదురుచూస్తున్నానని తమిళ హీరో విష్ణు విశాల్‌ సోషల్‌ మీడియాలో వేదికగా పోస్ట్‌ పెట్టారు.

Updated : 05 Dec 2023 16:13 IST

చెన్నై: మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది (chennai rains). ఈ క్రమంలో.. తాను నివాసం ఉండే ప్రాంతంలోని పరిస్థితిని వివరిస్తూ హీరో విష్ణు విశాల్‌ పోస్ట్‌ (Vishnu Vishal) పెట్టారు. సంబంధిత ఫొటోలు షేర్‌ చేశారు. తాను ఉంటున్న కారప్పాకంలోని ఇంట్లోకి వరద నీరు వచ్చిందని, క్రమంగా ఉద్ధృతి పెరుగుతోందని తెలిపారు. ‘‘విద్యుత్తు, ఇంటర్నెట్‌ లేదు. ఫోన్‌ సిగ్నల్‌ కూడా సరిగా అందడం లేదు. ఇంటిపై ఓ చోట మాత్రమే సిగ్నల్‌ వస్తుంది. అక్కడ నుంచే ఇది పోస్ట్‌ చేస్తున్నా. నాకు, ఇదే ప్రాంతంలో ఉంటున్న వారికి సాయం అందుతుందని ఆశిస్తున్నా. చెన్నై ప్రజల అవస్థను చూస్తుంటే బాధగా ఉంది’’ అని విష్ణు విశాల్‌ తన పోస్ట్‌లో రాశారు.

ఈ పోస్ట్‌ పెట్టిన కొద్ది సేపటికే ఫైర్‌, రెస్క్యూ విభాగాలు స్పందించాయి. కారప్పాకం ఏరియాలో సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ విషయాన్ని విష్ణు విశాల్‌ తాజాగా మరో పోస్ట్‌ ద్వారా తెలియజేస్తూ తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయంలో ఆదుకుందని ప్రశంసించారు. రెస్క్యూ టీమ్‌తో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ ఖాన్‌ కనిపించడం గమనార్హం.

మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్‌ అసహనం

విష్ణు విశాల్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘అరణ్య’, ‘ఎఫ్‌.ఐ.ఆర్‌’, ‘మట్టి కుస్తీ’ తదితర చిత్రాలతో అలరించాయన. త్వరలో ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam)తో సందడి చేయనున్నారు. ఇందులో అగ్ర నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) కీలక పాత్ర పోషించారు. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని