Aksha: పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌ హీరోయిన్ అక్షా పార్దసాని (Aksha Pardasany) పెళ్లిపీటలెక్కారు. ఫిబ్రవరి 26న తన ప్రియుడిని వివాహం చేసుకున్నారు.

Updated : 27 Feb 2024 11:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న నటి అక్షా పార్దసాని (Aksha Pardasany) తన ప్రియుడితో ఏడడుగులు వేశారు. బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ కౌశల్‌ని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడాది వీరి నిశ్చితార్థం జరగ్గా.. ఫిబ్రవరి 26న గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ ఫొటోలను షేర్‌ చేసిన అక్ష.. ‘మా ప్రార్థనలు ఫలించాయి. మేమిద్దరం ఒక్కటయ్యాం. దేవుడి దయతో పాటు మా ఇరు కుటుంబాల ఆశీర్వాదాలు మాకెప్పుడూ ఉంటాయి’ అని క్యాప్షన్‌ పెట్టారు. దీంతో నెటిజన్లు, సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టిన అక్ష.. ఇప్పటి వరకు 75కు పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించారు. సినిమాలపై ఆసక్తితో 2004లో ‘ముసాఫిర్‌’ అనే చిత్రంతో బాలనటిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. తెలుగులో ‘యువత’, ‘రైడ్‌’, ‘కందిరీగ’, ‘బెంగాల్‌ టైగర్‌’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మొత్తం 16కు పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు.

 అందరి చూపు.. ఈ సిరీస్‌ల సీక్వెల్స్‌ వైపు.. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

ఇక వీరి వివాహంలో పెళ్లి కొడుకు ఎంట్రీ కూడా ఫన్నీగా ఉండడంతో సరదా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. కౌశల్‌ సినిమాటోగ్రాఫర్‌ కావడంతో మండపానికి కెమెరా క్రేన్‌పై ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘కెమెరా మ్యాన్‌ అనిపించుకున్నావ్‌’, ‘కొత్త ఆలోచన’ అంటూ పలువురు కామెంట్స్‌ పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని