Alia Bhatt: మరీ ఇంత దారుణమా.. అలియా డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌

నటి అలియాభట్‌ (Aliabhatt)కు సంబంధించిన ఓ డీప్‌ ఫేక్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 27 Nov 2023 16:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అధునాతన సాంకేతికతను ఆసరాగా చేసుకుని రోజురోజుకీ సోషల్‌మీడియాలో కొందరు సైబర్‌ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సినీ తారలను టార్గెట్‌ చేసుకుని మార్ఫింగ్‌ వీడియోలు, ఫొటోలతో ఇబ్బందిపెడుతున్నారు. ఈక్రమంలోనే రష్మిక, కాజోల్‌పై డీప్‌ ఫేక్‌ వీడియోలు మర్చిపోకముందే  తాజాగా నటి అలియాభట్‌ను టార్గెట్‌ చేస్తూ వీడియో సృష్టించారు. అసభ్యకరంగా ఉన్న మహిళ వీడియోకు అలియా ముఖాన్ని జత చేసి ఫేక్‌ వీడియో సృష్టించారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఒక నటీమణిని మానసికంగా ఇబ్బందిపెట్టడం సమంజసం కాదు’, ‘వాళ్లు వెండితెర తారలైనప్పటికీ ఓ ఇంటి మహిళలే కదా.. ఇలాంటి వీడియోలతో వాళ్లతోపాటు వాళ్ల కుటుంబసభ్యులను బాధపెట్టడం ఎందుకు?’, ‘మరీ దారుణమా..!’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

డీప్‌ఫేక్‌... మాయలో పడొద్దు!

గత కొన్నిరోజుల క్రితం సోషల్‌మీడియా తార జారా పటేల్‌ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించి వీడియో క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై అమితాబ్‌ బచ్చన్‌, కీర్తిసురేశ్‌, నాగచైతన్య, విజయ్‌ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనలు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టింది. రష్మిక ఫేక్‌ వీడియో మర్చిపోక ముందే కాజోల్‌కు సంబంధించిన ఓ మార్ఫింగ్‌ వీడియో వైరల్‌ అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు