Poacher: నిర్మాతగా మారిన అలియా.. అమెజాన్‌ ప్రైమ్‌లో ‘పోచర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అమెజాన్‌ ప్రైమ్‌లో రాబోతున్న ‘పోచర్‌’ వెబ్‌సిరీస్‌కు బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Published : 06 Feb 2024 16:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌ (Alia Bhatt) నిర్మాతగా మారారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో కలిసి ఆమె ఓ వెబ్‌సిరీస్‌కు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మీ అవార్డు విన్నర్‌, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన క్రైమ్‌ సిరీస్‌ ‘పోచర్‌’ (Poacher). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అలియాభట్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ఆ ఓటీటీ సంస్థ తెలిపింది.

‘పోచర్‌’లో నిమేషా సజయన్‌, రోషన్‌ మాథ్యూ కీలకపాత్రలు పోషించారు. ఈసందర్భంగా అలియాభట్‌ మాట్లాడుతూ.. ‘ఒక అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. ఈ భూమ్మీద జీవించే అన్ని జీవరాశులపై కరుణ, జాలి ఉండాలనే బలమైన సందేశాన్ని ‘పోచర్‌’ (poacher web series) ఇస్తుందని నమ్ముతున్నా. అంతేకాదు, చాలామంది కళ్లు తెరిపిస్తుంది. దర్శకుడు రిచీ, ప్రైమ్‌ వీడియోతో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది’ అని చెప్పుకొచ్చింది. ఏనుగు దంతాల స్మగ్లింగ్‌తో పాటు, క్రైమ్‌ ఎలిమెంట్స్‌తో ఈ సిరీస్‌ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని