Deepika Padukone: దీపికా పదుకొణె బేబీ బంప్‌పై ట్రోలింగ్‌.. వైరలవుతోన్న జర్నలిస్ట్‌ పోస్ట్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె బేబీ బంప్‌పై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విషయంలో దీపికాకు అలియాభట్‌ మద్దతుగా నిలుస్తున్నారు.

Published : 23 May 2024 15:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకొణె త్వరలోనే తల్లి కానున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తన భర్త రణ్‌వీర్‌తో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే, కొందరు నెటిజన్లు దీపికా (Deepika Padukone) బేబీ బంప్‌పై ట్రోలింగ్‌ చేస్తూ నెగెటివ్‌ కామెంట్స్ పెట్టారు. వీటిని వ్యతిరేకిస్తూ ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్‌కు బాలీవుడ్‌ ప్రముఖులు స్పందిస్తూ మద్దతు తెలుపుతున్నారు.

‘మనం’ విషయంలో ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది: నాగార్జున

దీపికా ప్రెగ్నెంట్‌ కాదని.. బేబీ బంప్‌ ఫేక్‌ అంటూ కొందరు నెటిజన్లు పోస్ట్‌లు పెట్టారు. దీనిపై ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ స్పందిస్తూ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘డియర్‌ సోషల్‌ మీడియా.. ప్రజాస్వామ్యం తనకు ఇచ్చిన ఓటు హక్కును దీపికా పదుకొణె వినియోగించుకున్నారు. అందుకే బయటకు వచ్చారు. ఆమె శరీరం, ఆమె గర్భం గురించి మీ అభిప్రాయాన్ని అడగలేదు. ఆమె జీవితంలోని ఏ అంశంపైనా కామెంట్‌ చేసే అధికారం మీకు లేదు. ట్రోలింగ్‌ ఆపేసి.. హద్దులో ఉండండి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ పెట్టిన వెంటనే స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ (Alia Bhatt) లైక్‌ చేసి ‘బాగా చెప్పారు’ అని కామెంట్‌ చేశారు. మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ పోస్ట్‌ను లైక్‌ చేసి షేర్‌ చేస్తున్నారు. మరోవైపు దీపికాకు సపోర్ట్‌ చేసినందుకు ఆమె అభిమానులు అలియాకు థ్యాంక్స్‌ చెబుతున్నారు. ఈ సమయంలో దీపికాకు అందరూ సపోర్ట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని