Cannes Film Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.. స్క్రీనింగ్‌ కాంపిటిషన్‌కు భారతీయ చిత్రం: 30 ఏళ్ల తర్వాత ఇప్పుడే

30 ఏళ్ల తర్వాత మరో ఇండియన్‌ ఫిల్మ్‌ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ స్క్రీనింగ్‌ కాంపిటిషన్‌కు ఎంపికైంది.

Published : 12 Apr 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిష్ఠాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ స్క్రీనింగ్‌ కాంపిటీషన్‌కు (Cannes Film Festival 2024) భారతీయ చిత్రం ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ (All We Imagine as Light) ఎంపికైంది. ఈ విషయాన్ని కేన్స్ ఫిల్మ్ నిర్వాహకులు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ పోటీలో ప్రదర్శించే సినిమాల జాబితాను గురువారం విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన సినిమాలు ఇందులో పోటీ పడనున్నాయి. 1994 (తొలి సినిమా స్వహం) తర్వాత ఈ ఫెస్టివల్‌ స్క్రీనింగ్‌ కాంపిటిషన్‌కు సెలెక్ట్‌ అయిన ఇండియన్‌ మూవీ ఇదొక్కటే. ఈ సినిమాతోపాటు యోర్గోస్ లాంతిమోస్ (Yorgos Lanthimos), మెగాలోపోలిస్ (Megalopolis), ఓహ్ కెనడా (Oh Canada), బర్డ్ (Bird), అనోరా (Anora) తదితర చిత్రాలు బరిలో నిలిచాయి.

ముంబయి నర్సింగ్‌ హోమ్‌లో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సుల కథే ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’. పాయల్‌ కపాడియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 77వ కేన్స్​ఫిల్మ్ ఫెస్టివల్ మే 14 నుంచి 25 వరకు జరగనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు