Allu Arjun: యానిమల్‌ మైండ్‌ బ్లోయింగ్‌ మూవీ.. మెచ్చుకున్న అల్లు అర్జున్‌

‘యానిమల్‌’ (Animal) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun). సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.

Published : 08 Dec 2023 16:03 IST

హైదరాబాద్‌: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) - రష్మిక (Rashmika) ప్రధాన పాత్రల్లో సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun). భారతీయ చిత్ర పరిశ్రమలోని క్లాసిక్‌ చిత్రాల జాబితాలోకి ‘యానిమల్‌’ చేరిందన్నారు. సందీప్‌ మేకింగ్‌ స్టైల్‌, నటీనటుల ప్రదర్శనను పేరు పేరునా మెచ్చుకున్నారు.

‘‘యానిమల్‌’ను తీర్చిదిద్దిన తీరు మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది. టీమ్‌ అందరికీ నా అభినందనలు! రణ్‌బీర్‌ కపూర్‌.. మీ నటనతో భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. మీ నటన ఎంతో స్ఫూర్తినిచ్చింది. మీరు క్రియేట్‌ చేసిన మ్యాజిక్‌ను వర్ణించడానికి మాటలు రావడం లేదు. రష్మిక.. నీ యాక్టింగ్‌ అద్భుతం, ఆకర్షణీయంగా ఉంది. ఇప్పటివరకూ నటించిన చిత్రాల్లో ఇదే నీ ఉత్తమమైన ప్రదర్శన. ఇలాంటి ప్రదర్శనలు నువ్వు మరెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇక తన నటనతో ప్రేక్షకులకు మాటలు రాకుండా చేశారు నటుడు బాబీ దేవోల్‌. అనిల్‌ కపూర్‌.. తీవ్రతతో కూడిన ప్రదర్శన కనబరిచారు. నటన పట్ల మీకున్న అనుభవాన్ని ఈ పాత్ర తెలియజేస్తుంది. యువ నటి త్రిప్తి డిమ్రి.. ఈ చిత్రంతో ఎంతోమంది హృదయాలు కొల్లగొట్టారు. రానున్న రోజుల్లోనూ ఆమె మరెంతో మంది ప్రేమను పొందాలని కోరుకుంటున్నా.

రివ్యూ: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌తో నితిన్‌ హిట్‌ అందుకున్నారా..?

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ఈ చిత్రంతో సినిమాటిక్‌ పరిమితులను అధిగమించారు. మరోసారి మా అందరినీ గర్వపడేలా చేశారు. మీరు తెరకెక్కించే చిత్రాలు ఇండియన్‌ సినిమా దశను ఎలా మార్చగలవో నాకు స్పష్టంగా తెలుస్తోంది’’ అని ఆయన పోస్ట్‌ పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని