Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’.. ఏ ఓటీటీలో వస్తోందంటే?

ambajipeta marriage band ott release date: సుహాస్‌ కీలక పాత్రలో నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Published : 23 Feb 2024 21:48 IST

హైదరాబాద్‌:  సుహాస్‌ (Suhas), శివానీ (Shivani) జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్‌ కటికనేని దర్శకుడు. శరణ్య ప్రదీప్‌, నితిన్‌ ప్రసన్న కీలకపాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా సుహాస్‌, శరణ్యల నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో (Aha) త్వరలోనే (Ambajipeta Marriage Band ott release) స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్‌ను పంచుకుంది. ‘మల్లిగాడి మ్యాజికల్‌ వరల్డ్‌ కోసం సిద్ధం కండి’ అని ట్వీట్ చేసింది. మార్చి మొదటివారంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకువచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్‌ ఓటీటీ అప్‌డేట్స్‌ కోసం ఈనాడు ‘ఓటీటీ సంగతులు’ చూస్తూ ఉండండి.

క‌థేంటంటే: అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో ఓ స‌భ్యుడు మ‌ల్లి (సుహాస్‌). చిర‌త‌పూడిలో త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తుంటాడు. అక్క ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) ఆ ఊరి స్కూల్లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. ఊరి మోతుబ‌రి వెంక‌ట్‌బాబు (నితిన్ ప్ర‌స‌న్న‌) వ‌ల్లే ప‌ద్మ‌కి ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌నే వదంతు మొద‌ల‌వుతుంది. ఇంత‌లో వెంక‌ట్‌బాబు చెల్లెలు ల‌క్ష్మి (శివాని నాగారం), మ‌ల్లి ప్రేమ‌లో ప‌డ‌తారు. వెంక‌ట్‌బాబు త‌మ్ముడికి, మ‌ల్లికి మ‌ధ్య ఊళ్లో గొడ‌వ, ఆ త‌ర్వాత స్కూల్ విష‌యంలో ప‌ద్మ‌కీ, వెంక‌ట్‌బాబుకీ మ‌ధ్య వైరం మొద‌ల‌వుతుంది. అవి చిలికి చిలికి గాలివాన‌లా మార‌తాయి. ఇంత‌లో మ‌ల్లి, ల‌క్ష్మిల మ‌ధ్య ప్రేమ సంగ‌తి కూడా బ‌య‌టప‌డుతుంది. ఎలాగైనా ఆ కుటుంబంపై  ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ఓ రోజు వెంక‌ట్‌బాబు... రాత్రి వేళ‌లో ప‌ద్మని స్కూల్‌కి పిలిపించి అవ‌మానిస్తాడు. ఆ త‌ర్వాత ఏం జరిగింది?మ‌ల్లి, ల‌క్ష్మిల ప్రేమ‌క‌థ ఎలాంటి మ‌లుపు తీసుకుంద‌నే విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని