Amitabh Bachchan: అమితాబ్‌ బచ్చన్‌కు బెదిరింపులు.. భద్రత పెంపు!

Eenadu icon
By Entertainment Team Published : 31 Oct 2025 11:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌కు బెదిరింపుల నేపథ్యంలో కేంద్రం ఆయనకు భద్రత పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమితాబ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’) కార్యక్రమానికి పంజాబీ గాయకుడు దిల్జీత్‌ దోసాంజ్‌ ఇటీవల అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. వేదికపై అమితాబ్‌ కాళ్లకు దిల్జీత్‌ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడం వివాదానికి దారితీసింది. 

అమితాబ్‌ (Amitabh Bachchan) కాళ్లకు దిల్జీత్‌ నమస్కారం చేయడంపై ఖలిస్థానీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. నవంబర్‌ 1న జరగనున్న సిక్కుల స్మారక దినోత్సవం రోజున దిల్జీత్‌ (Diljit Dosanjh) ప్రదర్శనను అడ్డుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమితాబ్‌కు కూడా బెదిరింపులు వచ్చే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారంతో కేంద్రం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఆయన భద్రతపై కేంద్ర ఏజెన్సీలు సమీక్ష నిర్వహిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బిగ్‌బీకి భద్రత పెంచే అవకాశాలు కన్పిస్తున్నట్లు సమాచారం.

1984లో సిక్కుల మారణహోమానికి బాధ్యత వహించినవారిలో అమితాబ్‌ కూడా ఉన్నారని.. ఆయన కాళ్లకు దిల్జీత్‌ నమస్కారం చేయడం సిక్కులను అవమానించడమని ఖలిస్థానీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు