Kalki: ‘కల్కి’పై అమితాబ్‌ పోస్ట్.. ఆ వార్తలకు చెక్‌!

‘కల్కి’ షూటింగ్ దాదాపు పూర్తయిందని అమితాబ్‌ అన్నారు.

Published : 14 Mar 2024 15:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ చిత్రంలో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ గురించి అమితాబ్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. అలాగే విడుదల తేదీని కూడా చెప్పడంతో దీనిపై వస్తోన్న రూమర్స్‌కు చెక్‌ పడింది. ‘‘కల్కి’ షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి మళ్లీ ఆలస్యమైంది. ఈ చిత్రీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ముందుగా చెప్పిన సమాచారం ప్రకారమే మే 9న విడుదల కానుంది. ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వడానికి ఎంతోమంది కష్టపడి పని చేస్తున్నారు’ అని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. దీంతో ఈ సినిమా విడుదల విషయంలో మరోసారి క్లారిటీ వచ్చింది.

జపాన్‌లో ‘ఆర్ఆర్‌ఆర్‌’ క్రేజ్‌.. ఒక్క నిమిషంలో థియేటర్‌ హౌస్‌ఫుల్‌

ఇందులో ప్రభాస్‌ భైరవగా కనిపించనున్నారు. పలు భాషలకు చెందిన అగ్ర నటీనటులు భాగం కావడంతో అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan), రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘‘మహాభారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాల్ని సృష్టించడానికి ప్రయత్నించాం. ఆ ప్రపంచాలు కూడా భారతీయతని ప్రతిబింబించేలా ఊహించుకుంటూ మలిచాం’’ అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇటీవల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని