Anasuya: జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ

తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. 

Updated : 29 Mar 2024 14:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాంకర్‌ అనసూయ (Anasuya) త్వరలో రాజకీయాల్లోకి రానున్నారని, జనసేన పార్టీలో చేరనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆమె తాజాగా స్పందించారు.

‘‘నేను తుమ్మినా, దగ్గినా కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చానంతే. నాయకుడు నచ్చి, అతడి అజెండా నచ్చితే తప్పకుండా ప్రోత్సహిస్తానని చెప్పా. అంతేకానీ, పార్టీలో చేరతానని లేదా ప్రచారం చేస్తానని చెప్పలేదు. ‘జనసేన’ పార్టీ అజెండా నాకెంతో నచ్చింది’’ అని స్పష్టతనిచ్చారు.

‘రజాకార్’లో యాక్ట్‌ చేయడం గురించి మాట్లాడుతూ.. ‘‘పాత్ర నచ్చితే తప్పకుండా ఏ చిత్రంలోనైనా నటిస్తా. ‘రజాకర్‌’ అనేది మన చరిత్ర. అలాంటి మూవీలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని