Animal: సందీప్‌ రెడ్డి ఒరిజినల్‌ డైరెక్టర్‌.. ఆ సీక్వెన్స్‌ ఆలోచన వారిదే: రణ్‌బీర్‌ కపూర్‌

చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ‘యానిమల్‌’ చిత్ర బృందం పాల్గొంది. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక తదితరులు సినిమా గురించి పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 26 Nov 2023 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). రష్మిక (Rashmika Mandanna) కథానాయిక. అనిల్‌ కపూర్‌ (Anil Kapoor), బాబీ దేవోల్‌ (Bobby Deol) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 1న (Animal Release Date) పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. అందులో భాగంగానే రణ్‌బీర్‌, రష్మిక, బాబీ దేవోల్‌ తదితరులు చెన్నై వెళ్లారు. అక్కడి అభిమానులు, మీడియాతో ముచ్చటించారు.

ఆ కారణంతోనే ‘ఉప్పెన’ వదులుకున్నా: శివానీ రాజశేఖర్‌

రణ్‌బీర్‌ మాట్లాడుతూ.. ‘‘యానిమల్‌’ కథ క్లిష్టమైంది. ఇందులోని నా పాత్ర ఎన్నో ఎమోషన్స్‌తో కూడుకున్నది. ఇతర పాత్రలూ క్లిష్టమైనవే. ప్రేక్షకులు తప్పకుండా ఈ క్యారెక్టర్లను, సినిమాని ఆస్వాదిస్తారనే నమ్మకం ఉంది. సందీప్‌ రెడ్డి ఒరిజినల్‌ డైరెక్టర్‌ ’’ అని ప్రశంసించారు. ట్రైలర్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ‘వార్‌ మెషీన్‌ సీక్వెన్స్‌’పై స్పందిస్తూ.. ‘‘ప్రొడక్షన్‌ డిజైనర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ సెల్వరాజన్‌ దాన్ని చూపించగానే షాక్‌ అయ్యా. అందుబాటులో ఉన్న వస్తువులతో.. ఒరిజినల్‌ వార్‌ మెషీన్‌ను తలపించేలా తీర్చిదిద్దాడు. సందీప్‌, సెల్వరాజన్‌లకు వచ్చిన గ్రేట్‌ ఐడియా అది’’ అని తెలిపారు. కోలీవుడ్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. విక్రమ్‌ (కమల్‌ హాసన్‌ హీరో), జైలర్‌ (రజనీకాంత్‌ హీరో), లియో (విజయ్‌) తనకు బాగా నచ్చిన చిత్రాలన్నారు.

‘‘నా పాత్రకు సంబంధించిన సీరియస్‌ సన్నివేశాన్ని మీరు ట్రైలర్‌లో చూసేశారు. అసలు నా క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే’’ అని రష్మిక పేర్కొన్నారు. ‘‘యానిమల్‌’ సినిమాలో భాగంకావడం, రణ్‌బీర్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం ఎప్పుడోగానీ రాదు. యానిమల్‌.. మంచి ఎమోషనల్‌ డ్రామా’’ అని బాబీ దేవోల్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని