Anu Emmanuel: క్యాస్టింగ్‌ కౌచ్‌ సమయంలో.. వారే సపోర్ట్‌ ఇచ్చారు: అనూ ఇమ్మాన్యుయేల్‌

తన కొత్త సినిమా ‘జపాన్‌’ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించారు హీరోయిన్‌ అనూ ఇమ్మాన్యుయేల్‌.

Published : 28 Aug 2023 15:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్: క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి అనూ ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel) స్పందించారు. కెరీర్‌ ప్రారంభంలో తానూ దాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు. కొందరు వక్ర బుద్ధితో సినిమాలో అవకాశం ఇస్తామంటూ తనను సంప్రదించేవారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో అలాంటి వారికి తాను భయపడలేదన్నారు. ఎవరికైనా ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు కుటుంబం అండగా ఉంటే దాన్ని సులువుగా ఎదుర్కోవచ్చని సలహా ఇచ్చారు. తన కొత్త చిత్రం ‘జపాన్‌’ (Japan) ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అందుకే అతడితో బంధం ముగిసింది.. మొదటి బాయ్‌ ఫ్రెండ్‌పై జాన్వీ కపూర్‌ కామెంట్స్‌

కార్తి (Karthi) హీరోగా దర్శకుడు మురుగన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. తమిళనాడులోని పలు బంగారు దుకాణాల నుంచి కొన్ని కిలోల బంగారాన్ని దొంగలించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. బంగారం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తిగా కార్తి కనిపించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూ ఇమ్మాన్యుయేల్‌ విషయానికొస్తే.. ‘స్వప్న సంచారి’ అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె తెలుగు చిత్రం ‘మజ్ను’తో హీరోయిన్‌గా మారారు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్‌’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘ఊర్వశివో రాక్షసివో’, ‘రావణాసుర’ తదితర చిత్రాల్లో నటించి అలరించారు. ఓ హీరోతో ఆమె డేటింగ్‌ చేస్తుందంటూ కొన్ని నెలల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నటీనటులపై ఇలాంటి వార్తలు రావడం సాధారణమని, అసత్య ప్రచారాలను తాను పట్టించుకోనని అన్నారు. అయితే, ఈ వార్తలు చదివి తన తల్లి బాధపడిందని అప్పట్లో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని