Janhvi Kapoor: అందుకే అతడితో బంధం ముగిసింది.. మొదటి బాయ్‌ ఫ్రెండ్‌పై జాన్వీ కపూర్‌ కామెంట్స్‌

నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) తన మొదటి బాయ్‌ ఫ్రెండ్‌ గురించి చెప్పింది. అతడితో బంధం ఎందుకు ముంగించాల్సి వచ్చిందో తెలిపింది.

Published : 28 Aug 2023 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీదేవి కుమార్తెగా వెండితెరకు పరిచయమై.. మంచి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ అవకాశాలను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఓ టాక్‌షోలో పాల్గొన్న జాన్వీ.. తన మొదటి బాయ్ ఫ్రెండ్‌తో బంధాన్ని ఎందుకు ముగించాల్సి వచ్చిందో తెలిపింది.

‘‘నేను, నా మొదటి బాయ్ ఫ్రెండ్‌ రహస్యంగా కలుసుకునే వాళ్లం. మేమిద్దరం ఒకరితో ఒకరం చాలా అబద్ధాలు చెప్పుకొనేవాళ్లం. దురదృష్టవశాత్తూ.. నేను చెప్పిన ఓ అబద్ధం కారణంగా ఆ రిలేషన్ ముగిసింది. అలాగే నాకు బాయ్ ఫ్రెండ్‌ ఉండకూడదని నా తల్లిదండ్రులు కూడా చెప్పారు. వాళ్లతో నిజాయతీగా ఉంటే అన్నీ సులభంగా మారతాయని అర్థం చేసుకున్నా. పేరంట్స్‌ నిర్ణయాలకు అనుగుణంగా వెళితే భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం’’ అని జాన్వీ చెప్పింది. అయితే జాన్వీ ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో చెప్పకపోవడంతో నెటిజన్లంతా సరదాగా స్పందిస్తున్నారు. ‘ఇది మీ స్కూల్లో జరిగిందా’ అని కామెంట్‌ చేస్తున్నారు. 

తమన్నా కోసం నా డేటింగ్‌ రూల్‌ బ్రేక్‌ చేశా: విజయ్‌ వర్మ

ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవలే జాన్వీ కపూర్‌ ‘బవాల్‌’తో విజయాన్ని అందుకుంది. అలాగే ‘దేవర’లో (Devara) ఎన్టీఆర్‌ సరసన కనిపించనుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఆమె డీగ్లామరైజ్‌ పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే దీని షూటింగ్లో పాల్గొన్న జాన్వీ.. సెట్లో అందరూ తనతో ప్రేమగా ఉన్నారని తెలిపింది. అందుకే కెమెరా ముందు స్వేచ్ఛగా నటించగలిగినట్లు చెప్పింది. అందరి ప్రేమను చూస్తుంటే సొంతింటికి వచ్చినట్లుగా ఉందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని