Anurag Kashyap: ఆ విషయాన్ని తట్టుకోలేకపోయా.. రెండు సార్లు గుండెపోటుకు గురయ్యా: అనురాగ్‌ కశ్యప్‌

‘మ్యాగ్జిమమ్‌ సిటీ’ (Maximum City) ప్రాజెక్ట్‌ ఆగిపోవడంపై దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) తాజాగా స్పందించారు. అర్ధాంతరంగా అది ఆగిపోవడం తనని ఎంతో బాధకు గురి చేసిందన్నారు.

Published : 22 Nov 2023 15:24 IST

ముంబయి: సుకేతు మెహతా రచించిన ‘మ్యాగ్జిమమ్‌ సిటీ’ (Maximum City) పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఓ ప్రాజెక్ట్‌ తెరకెక్కించనున్నట్లు  బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag kashyap) గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ స్పెషల్‌ ప్రాజెక్ట్‌గా పట్టాలెక్కిన ఇది అనుకోని కారణాలతో నిలిచిపోయింది. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనురాగ్‌ స్పందించారు. తాను ఇష్టపడి వర్క్‌ చేసిన ప్రాజెక్ట్‌ అర్ధాంతరంగా నిలిచిపోవడం తనని ఎంతగానో బాధకు గురి చేసిందన్నారు.

Oppenheimer: ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ ‘ఓపెన్‌హైమర్‌’.. కండిషన్స్‌ అప్లయ్‌..!

‘‘ఆ ప్రాజెక్ట్‌ కోసం నేను ఎంతో కష్టపడి వర్క్‌ చేశా. అది నా బెస్ట్‌ వర్క్‌. అయితే, సరైన కారణాలు చెప్పకుండా ఓటీటీ సంస్థ ఆ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగింది. ఆ విషయాన్ని నేను తట్టుకోలేకపోయా. అది నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. మానసిక కుంగుబాటుకు గురై.. అతిగా మద్యం సేవించా. ఆ సమయంలో రెండు సార్లు గుండెపోటుకు గురయ్యా. ఏదైమైనా నేను దాన్ని కోల్పోయాను’’ అని ఆయన తెలిపారు. ‘బ్లాక్‌ ఫ్రైడే’, ‘నో స్మోకింగ్‌’, ‘బాంబే వెల్వెట్’, ‘దోబారా’ వంటి చిత్రాలకు అనురాగ్‌ దర్శకత్వం వహించారు. సన్నీలియోనీ, రాహుల్‌ భట్‌తో ఇటీవల ఆయన ‘కెన్నెడీ’ నిర్మించారు. జీ 5 వేదికగా విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలు అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని