Oppenheimer: ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్‌ ‘ఓపెన్‌హైమర్‌’.. కండిషన్స్‌ అప్లయ్‌..!

హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘ఓపెన్‌హైమర్‌’ (Oppenheimer) ఓటీటీలోకి అడుగుపెట్టింది.

Published : 22 Nov 2023 13:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హాలీవుడ్‌ రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ఓపెన్‌హైమర్‌’. క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ (Robert J Oppenheimer) జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి రెంట్‌ విభాగంలో అందుబాటులో ఉన్న ఈ సినిమా వీక్షించాలంటే రూ.149 చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రైమ్‌ వీడియో పోస్ట్‌ పెట్టింది.

రష్మితో సినిమా ఎప్పుడు చేస్తారు?సుధీర్‌ సమాధానమిదే..

అణు బాంబును కనుగొన్న శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా చేసుకుని ‘ఓపెన్‌ హైమర్‌’ను రూపొందించారు. ఈ ఏడాది జులై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. 100 మిలియన్‌ డాలర్లతో దీనిని నిర్మించగా.. 950 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దినప్పటికీ భగవద్గీతకు సంబంధించి చిత్రీకరించిన ఓ సన్నివేశం వివాదాస్పదంగా మారింది. శృంగార సన్నివేశంలో భగవద్గీతను చూపించడాన్ని సినీప్రియులు తప్పుబట్టారు. ఆ సీన్‌ తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని