Aishwarya Arjun: అర్జున్‌ ఇంట పెళ్లి సందడి షురూ.. ఫొటోలు వైరల్‌

ప్రముఖ నటుడు అర్జున్‌ తనయ, నటి ఐశ్వర్య వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. హల్దీ, మెహందీ వేడుకల ఫొటోలు వైరల్‌గా మారాయి.

Updated : 10 Jun 2024 07:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు అర్జున్‌ (Arjun Sarja) ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె, నటి ఐశ్వర్య (Aishwarya Arjun) వివాహం నటుడు ఉమాపతి రామయ్య (Umapathy Ramaiah)తో అతి త్వరలోనే జరగనుంది. ఇందులో భాగంగా చెన్నైలోని అర్జున్‌ నివాసంలో హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు నిర్వహించారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. సంగీత్‌కు హాజరైన హీరో విశాల్‌.. అక్కడ దిగిన స్టిల్స్‌ను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అర్జున్‌ ఫ్యామిలీ తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు, దర్శకుడు తంబి రామయ్య (Thambi Ramaiah) కుమారుడే ఉమాపతి. అర్జున్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఉమాపతి, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. తమిళం, కన్నడ చిత్రాల్లో నటించారు ఐశ్వర్య. ఆమె హీరోయిన్‌గా ఓ తెలుగు సినిమా ఖరారు కాగా అది తాత్కాలికంగా నిలిచిపోయింది. అర్జున్‌ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా అది.

నటుడు ప్రేమ్‌జీ వివాహం.. సందడి చేసిన సెలబ్రిటీస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని