Dil raju: మరోసారి ‘ఆర్య’ కథ విన్నట్లు అనిపించింది: దిల్‌ రాజు

హీరో ఆశిష్‌, వైష్ణవి చైతన్య సినిమాకు ‘లవ్‌ మీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Published : 27 Feb 2024 16:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి ‘లవ్‌ మీ’ (love me) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా జరిగిన టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ ఈవెంట్‌కు దిల్‌రాజు (Dil raju) హాజరై మీడియాతో మాట్లాడారు.

‘ఈ సినిమా స్క్రిప్ట్‌ వినగానే 20 ఏళ్లు వెనక్కి వెళ్లాను. ‘ఆర్య’ కథ విన్నప్పుడు కలిగిన ఫీలింగ్‌ మరోసారి కలిగింది. కొత్త వాళ్లకు నా బ్యానర్‌లో అవకాశమిస్తానని గతంలోనే వెల్లడించాను. అందులోభాగంగానే ‘లవ్‌ మీ’ టీమ్‌కు అవకాశమిచ్చాను. ఈ సినిమాకు కథే బలం. 60 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ఏప్రిల్‌ 27న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తాం. ఈ రెండు నెలల్లోనే షూటింగ్‌, ప్రమోషన్స్‌ అన్ని పూర్తి చేస్తాం’ అని దిల్‌ రాజు అన్నారు. ‘ఈ స్టోరీ విన్న దగ్గరనుంచి షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు ఇలాంటి కథ వినలేదు. త్వరలోనే దీని టీజర్‌ విడుదల చేస్తాం. ఈ సినిమా చూశాక థియేటర్‌ నుంచి మంచి ఫీల్‌తో బయటకు వస్తారు’ అని నటి వైష్ణవి తెలిపారు.

అందరి చూపు.. ఈ సిరీస్‌ల సీక్వెల్స్‌ వైపు.. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

మరోవైపు దిల్‌ రాజుకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల విడుదల చేసిన దీని టీజర్‌కు మంచి ప్రేక్షకాదరణ లభించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని