bigg boss telugu 7: హౌస్‌లో రెండు బ్యాచ్‌లు SPA, SPY.. ఎందులో ఎవరు?

bigg boss telugu 7: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌లో భాగంగా తక్కువ ఓట్లు వచ్చిన అశ్విని, రతిక ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

Updated : 27 Nov 2023 15:21 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Bigg Boss Telugu7)నుంచి అశ్విని (Ashwini), రతిక (Rathika Rose)ఎలిమినేట్‌ అయ్యారు. యావర్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ తిరిగి ఇచ్చిన కారణంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ ఉంటుందని వ్యాఖ్యాత నాగార్జున (Nagarjuna) గతవారం ప్రకటించారు. అన్నట్లుగా శనివారం అశ్విని, ఆదివారం రతిక ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా వచ్చిన అశ్విని తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించింది. అలాగే, కొన్ని వారాల కిందట ఎలిమినేట్‌ అయిన రతిక, మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే, రెండోసారి మాత్రం తన ఆట తీరును ఏ మాత్రం మెరుగుపరుచుకోలేక, ప్రేక్షకుల మన్ననలు పొందలేక ఎలిమినేట్‌ అయింది. 

హౌస్‌లో రెండు గ్రూపులు

బిగ్‌బాస్‌ సీజన్‌-7లో హౌస్‌ అంతా రెండు గ్రూపులుగా విడిపోయిందని ఎలిమినేట్‌ అయిన అశ్విని చెప్పుకొచ్చింది. అమర్‌, ప్రియాంక, శోభ ఒక గ్రూప్‌ కాగా, శివన్న, యావర్‌, పల్లవి ప్రశాంత్‌, రతిక మరో గ్రూపుగా ఆడుతున్నారని చెప్పింది. ఇక గౌతమ్‌, అర్జున్‌లు ఏ గ్రూపులోనూ లేరని చెప్పగా, వెంటనే అందుకున్న నాగార్జున హౌస్‌లో ఉన్న గ్రూపులకు పేర్లు కూడా ఉన్నాయన్నారు. ‘‘శోభ, ప్రియాంక, అమర్‌ గ్రూపు ‘స్పా’(SPA) బ్యాచ్‌, వీళ్లను ‘చుక్క బ్యాచ్‌’ (స్టార్‌) అని కూడా అంటారు. శివాజీ, ప్రశాంత్‌, యావర్‌ గ్రూప్‌ ‘స్పై’ (SPY) , వీళ్లను మొక్క బ్యాచ్‌ అంటారు’’ అని అర్థం వివరించారు. ఈ రెండు గ్రూపులకు చెందని వారు తొక్క బ్యాచ్‌ అంటూ సరదాగా ఆటపట్టించారు.

అశ్విని దృష్టిలో వీళ్లు హిట్‌.. వాళ్లు ఫ్లాప్‌! హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయి, వేదికపైకి వచ్చిన అశ్విని బిగ్‌బాస్‌లో తన జర్నీ చూసి భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎవరు హిట్‌? ఎవరు ఫ్లాప్‌ అని నాగార్జున అడగ్గా, అందరూ బాగా ఆడుతున్నారని, లేకపోతే ఇన్ని రోజులు హౌస్‌లో ఉండేవారు కాదు అంటూ సేఫ్‌ గేమ్‌ ప్లే చేయాలని చూసింది. ‘ఇలాంటి సేఫ్‌ గేమ్‌ ఆడి నువ్వు సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకుని ఎలిమినేట్‌ అయ్యావు’ అంటూ నాగార్జున చురక అంటించడంతో హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎవరు హిట్‌? ఎవరు ఫ్లాప్‌ అనే విషయాన్ని చెప్పింది.

  • ప్రశాంత్‌: సూపర్‌ హిట్‌. కానీ, కొన్నిసార్లు మాట వినడు.
  • అమర్‌:  హిట్‌. కొంచె అమాయకుడు. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాడు!
  • యావర్‌: మంచి స్నేహితుడు. యావర్‌ కూడా సూపర్‌ హిట్‌. ఆటపరంగా బాగా ఆడతాడు.
  • రతిక: గేమ్‌ అంటే భయపడుతూ ఉంటుంది. ప్రస్తుతానికి రతిక ఫ్లాప్‌.
  • ప్రియాంక: ఫ్లాప్‌.. గట్టిగా అరుస్తుంది. నోరు పారేసుకుంటుంది.
  • గౌతమ్‌: హిట్‌.. హౌస్‌లో గ్రూపులున్నా సోలోగా ఆడతాడు.
  • శోభ: ఎప్పుడూ హిట్‌. పటాకా. పైకి కోపంగా కనిపిస్తుంది కానీ, మనుషుల్ని అర్థం చేసుకుంటుంది.
  • అర్జున్‌: సూపర్‌ హిట్‌. గేమ్‌ను ఒక ప్రణాళిక ప్రకారం ఆడతాడు. తన టీమ్‌లో ఉన్న వాళ్లను కూడా అలాగే ఆడిస్తాడు. 
  • శివాజీ: హిట్‌. అయితే, ఒక చిన్న సలహా అందరినీ కలుపుకొని వెళ్తే బాగుంటుంది. ఎప్పుడూ ప్రశాంత్‌, యావర్‌, రతికలే కాకుండా మిగిలిన వాళ్లను కూడా పట్టించుకోండి. (మధ్యలో శివాజీ అందుకుని.. పిలవగానే అశ్విని పలకదు. అందుకే దూరంగా ఉన్నాను)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు