Atlee: ‘జవాన్‌’కు అరుదైన గౌరవం.. ఆనందంగా ఉందంటూ అట్లీ పోస్ట్‌

ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ చిత్రాల జాబితాలో ‘జవాన్‌’ (Jawan) మొదటి స్థానంలో నిలిచింది. దీనిపై అట్లీ పోస్ట్‌ పెట్టారు.

Published : 06 Dec 2023 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రాల్లో ‘జవాన్’(Jawan) ఒకటి. అట్లీ-షారుక్‌ ఖాన్‌ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. తాజాగా ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ చిత్రాల జాబితాలో ‘జవాన్‌’ మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ అట్లీ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

‘‘జవాన్‌’ కొన్ని కోట్ల మంది హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది దీనిపై చూపిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఒక ఎమోషనల్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌. సమాజంలో జరిగే అన్యాయంపై ఓ వ్యక్తి పోరాటాన్ని నేను సినిమా రూపంలో మీ ముందుకు తెచ్చాను. నా ప్రతిభను ఐఎమ్‌డీబీ ప్రశంసించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ‘జవాన్‌’తో నా కల నిజమైంది. ఈ విజయంలో నాకు సహకరించిన షారుక్‌ ఖాన్‌కు (Shah Rukh Khan), నా భార్యకు అలాగే ముఖ్యంగా ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని అట్లీ పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ‘మీరు దీనికి అర్హులు’, ‘‘జవాన్‌2’ కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

డీప్‌ ఫేక్‌ బారిన ప్రియాంక చోప్రా.. నకిలీ వీడియో వైరల్‌

ఇక ప్రస్తుతం అట్లీ వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షారుక్‌-విజయ్‌లతో ఓ మల్టీస్టారర్‌ను ప్రకటించారు. ఇది రూ.3000 కోట్లు కచ్చితంగా వసూళ్లు చేస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే కోలీవుడ్‌ హీరో అజిత్‌ కుమార్‌ (Ajith)కోసం కూడా స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇక వీటితో పాటు అల్లు అర్జున్‌తో కూడా ఓ ప్రాజెక్ట్‌ లైన్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు