Jawan: జవాన్‌ కంటే మంచి కథ కుదిరితే సినిమా చేస్తా: అట్లీ

షారుక్‌ఖాన్ నటించిన ‘జవాన్’ కంటే గొప్ప కథ కుదిరితే ఆయనతో మరో సినిమా చేస్తానని దర్శకుడు అట్లీ తెలిపారు.

Published : 24 Feb 2024 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: షారుక్‌ఖాన్‌ (Shah Rukh Khan) నటించిన ‘జవాన్‌’ (Jawan) గత ఏడాది విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఉత్తమ నటీనటులుగా షారుక్‌ఖాన్‌, నయనతార అవార్డులు అందుకున్నారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో  షారుక్‌ఖాన్‌తో మరో సినిమా చేయాలనుందని అన్నారు. ‘‘షారుక్‌ఖాన్‌ నటించిన ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, డీడీఎల్‌జే సినిమాలంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి వర్క్‌ చేయాలన్నది నా కల. ‘జవాన్‌’ రూపంలో దేవుడు నాకు ఆ అవకాశం ఇచ్చాడు. భారతీయ సినీ పరిశ్రమకు మరో రూపమైన ఆయనతో కలిసి వర్క్‌ చేయాలనుంది. నా జీవితంలో నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరు. షారుక్‌ నన్ను ఎంతో అభిమానిస్తారు. ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉంటారు. జవాన్‌ కంటే గొప్ప కథ కుదిరితే కచ్చితంగా షారుక్‌ఖాన్‌తో వర్క్ చేస్తా’’ అని అట్లీ వెల్లడించారు.

జవాన్‌ ఎక్స్‌పీరియన్స్ గురించి అట్లీ మట్లాడుతూ..‘‘జవాన్‌ చిత్రీకరణ సమయంలో షారుక్‌ఖాన్‌ దగ్గర ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఓపికతో షూటింగ్‌ చేయడం, ప్రతీ సన్నివేశం అనుకున్నవిధంగా తెరకెక్కించాలి, అప్పుడే ఆ సినిమా విజయం సాధిస్తుందని ఆ సినిమా ద్వారా అనుభవంలోకి వచ్చింది’’ అని ఆయన తెలిపారు.  

‘డంకీ’, ‘పఠాన్‌’ వరుస చిత్రాలతో బాక్సాఫీస్‌ హిట్‌ అందుకున్నారు షారుక్‌. ప్రస్తుతం ఆయన సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు ‘పఠాన్‌-2’ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని