Ayalaan ott: తెలుగులో రిలీజ్‌ కాకుండానే ఓటీటీలో.. ‘అయలాన్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

శివ కార్తికేయన్‌ కీలక పాత్రలో నటించిన ‘అయలాన్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది.

Published : 06 Feb 2024 17:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) ప్రధాన పాత్రలో నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘అయలాన్‌’ (Ayalaan). రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) కథానాయిక. రవికుమార్‌ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో విడుదలకు రంగం సిద్ధమైంది. సన్‌ నెక్స్ట్‌ వేదికగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టింది. సంక్రాంతి కానుకగా ‘అయలాన్‌’ తెలుగులోనూ విడుదల చేయాలని భావించారు. అయితే, వరుస సినిమాల నేపథ్యంలో చివరి నిమిషంలో ఈ మూవీ పోటీ నుంచి తప్పుకొంది. జనవరి 26న విడుదల చేసే ఉద్దేశంతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సైతం నిర్వహించారు. అయినా అనుకోని కారణాల వల్ల రిలీజ్‌ వాయిదా పడింది.

కథేంటంటే: ఒక మిషన్‌లో భాగంగా భూమ్మీదకు వచ్చిన ఏలియన్‌.. తమీజ్‌ (శివ కార్తికేయన్‌)ను కలుస్తుంది. కొద్ది రోజులకే వారి మధ్య స్నేహం పెరుగుతుంది. తమీజ్‌ దానికి టట్టూ అనే పేరు పెడతాడు. కొన్ని సంఘటనల వల్ల టట్టూ కొంతమంది వ్యక్తుల చేతుల్లో చిక్కుతుంది. దాన్ని కాపాడటం కోసం తమీజ్‌ ఏం చేశాడు? అసలు టట్టూ భూమ్మీదకు రావడానికి ప్రధాన కారణం ఏమిటి? తన మిషన్‌ పూర్తి చేసుకుని అది తిరిగి తన లోకానికి ఎలా వెళ్లింది? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైంది. ఏలియన్‌ పాత్రకు సిద్ధార్థ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని