Ayalaan: కార్తికేయకు, నాకు మధ్య తేడా అదే: శివ కార్తికేయన్‌

శివ కార్తికేయన్‌ హీరోగా తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘అయలాన్‌’. ఈ సినిమా తెలుగులో ఈ నెల 26న విడుదల కానుంది.

Published : 25 Jan 2024 02:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంక్రాంతి కానుకగా బాక్సాఫీసు ముందుకు వచ్చిన తమిళ చిత్రాల్లో ‘అయలాన్‌’ (Ayalaan) ఒకటి. శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan), రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రవికుమార్‌ తెరకెక్కించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda), దర్శకులు గోపీచంద్‌ మలినేని, వశిష్ఠ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

‘అయలాన్‌’ సీక్వెల్.. ఆ ఒక్క దానికే రూ. 50 కోట్లు!

వేడుకనుద్దేశించి శివ కార్తికేయన్‌ మాట్లాడుతూ.. ‘‘సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. ‘అయలాన్‌’లోకి గ్రహాంతర వాసిని తీసుకొచ్చి మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేశాం. పిల్లలు, యువత, పెద్దలు.. ఇలా అన్ని వయసుల వారికి ఈ చిత్రం నచ్చుతుందని నమ్ముతున్నా. విభిన్న కథలను తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఆదరిస్తారు. మా చిత్రానికీ విజయాన్ని అందిస్తారని భావిస్తున్నా. ఈ సినిమాకి ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు నాకు మీరెంతో సపోర్ట్‌ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అదే అభిమానం చూపించాలని కోరుకుంటున్నా. కార్తికేయ తమిళ ప్రేక్షకులందరికీ తెలుసు. కార్తికేయ, శివ కార్తికేయన్‌కు మధ్య తేడా జిమ్‌ బాడీ. అతడి సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకోవాలి. ‘హను-మాన్‌’ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఆ చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.

‘‘సినీ నేపథ్యంలేని మాలాంటి ఎంతోమందికి శివ కార్తికేయన్‌ స్ఫూర్తి. తను ఎదగడమే కాకుండా చుట్టూ ఉన్నవారు ఉన్నత స్థానంలో ఉండేలా సహాయపడతారు. ఆయన్ను చూడొచ్చనే ఆసక్తితోనే ఈవెంట్‌కు వచ్చా’’ అని కార్తికేయ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని