Baahubali Crown of Blood: ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ ఫస్ట్‌ ఎపిసోడ్‌ ఫ్రీ.. చూసేయండి

Baahubali Crown of Blood: యానిమేటెడ్‌ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌ ఎపిసోడ్‌ను చూసే అవకాశాన్ని డిస్నీ+హాట్‌స్టార్‌ కల్పించింది.

Published : 27 May 2024 19:34 IST

హైదరాబాద్‌: ‘బాహుబలి’ చిత్రాలు సినీ ప్రియులను ఎంతగా అలరించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ ఫ్రాంఛైజీలో భాగంగా యానిమేటెడ్‌ సిరీస్‌ ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ (Baahubali Crown of Blood) వచ్చిన సంగతి తెలిసిందే. మే 17వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. వారానికొక ఎపిసోడ్‌ చొప్పున అందుబాటులోకి వస్తున్న ఈ సిరిస్‌ తొలి ఎపిసోడ్‌ ఇప్పుడు ఉచితంగా చూసే అవకాశాన్ని హాట్‌స్టార్‌ కల్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. మిగిలిన ఎపిసోడ్‌లను చూడాలంటే హాట్‌స్టార్‌కు లాగిన్‌ అవ్వాల్సిందే.

ఈ యానిమేటెడ్‌ సిరీస్‌కు జీవన్‌ జె.కాంగ్‌, నవీన్‌ జాన్‌ దర్శకత్వం వహించారు. గ్రాఫిక్‌ ఇండియా, ఆర్కా మీడియా వర్క్స్‌ ప్రై.లి.సంస్థలతో కలిసి రాజమౌళి, శరద్‌ దేవరాజన్‌, శోభు యార్లగడ్డ నిర్మించారు. ‘బాహుబలి సినిమా ప్రపంచాన్ని సృష్టించే సమయంలో అందులోని ప్రతీ పాత్రకు సంబంధించిన పూర్తి స్టోరీని రాసి పెట్టుకున్నాం. కాకపోతే ఆ మొత్తం కథను రెండు భాగాల్లో ప్రేక్షకులకు చెప్పడం అసాధ్యమని మాకు అర్థమై.. దాన్ని గేమ్స్‌, యానిమేటెడ్‌ సిరీస్‌ ఇలా వివిధ రూపాల్లో బయటకు తీసుకురావాలని ప్రయత్నించాం.  ఈ యానిమేటెడ్‌ సిరీస్‌ ‘బాహుబలి’కి సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌లా ఉండదు. ఆ రెండు భాగాలకు మధ్యలో జరిగే కథ ఇది. కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది. మేము రాబోయే రోజుల్లో ఈ బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. దానికి ఈ యానిమేటెడ్‌ సిరీస్‌ ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ఇది చాలా రకాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ వివరాల్ని త్వరలో వెల్లడిస్తా’ అని రాజమౌళి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని