Bandla Ganesh: ఆసుపత్రిలో చేరిన బండ్ల గణేశ్‌.. వీడియో వైరల్‌

బండ్ల గణేశ్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన చికిత్స తీసుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 04 Jun 2024 11:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) ఆసుపత్రిలో చేరారు. ఛాతి నొప్పితో బాధపడుతోన్న ఆయన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన అపోలోలో చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు, స్నేహితులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది.

‘పుష్ప 2’ సాంగ్‌.. 500 మందికిపైగా డ్యాన్సర్లు: కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య

గతంలో పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌ వంటి అగ్ర హీరోలతో బండ్ల గణేశ్‌ సినిమాలు నిర్మించి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రాజకీయాలకు సంబంధించిన పలు విషయాలపై తన అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఎన్నికల సమయంలో ఆయన చేసే కామెంట్స్‌ ఎప్పుడూ వైరల్‌ అవుతుంటాయి. ఇప్పుడు ఫలితాల రోజు ఆయన ఆసుపత్రిలో చేరడంపై పలువురు నెటిజన్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని