Pushpa 2: ‘పుష్ప 2’ సాంగ్‌.. 500 మందికిపైగా డ్యాన్సర్లు: కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య

‘పుష్ప 2’లోని ‘సూసేకి’ పాటకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు గణేశ్‌ ఆచార్య మాస్టర్‌.

Published : 04 Jun 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని రోజుల క్రితం విడుదలై, చాలామంది ఫేవరెట్‌ సాంగ్స్‌ లిస్ట్‌లో చేరిపోయింది ‘సూసేకి’ (Sooseki). ‘పుష్ప 2’ (Pushpa 2)లోని ఈ పాట యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అల్లు అర్జున్‌ (Allu Arjun)- రష్మిక (Rashmika) కెమిస్ట్రీ, హుక్‌ స్టెప్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చిన గణేశ్‌ ఆచార్య (Ganesh Acharya) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ‘‘సూసేకి.. స్వీట్‌ సాంగ్‌. గ్రాండ్‌గా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన లిరికల్ వీడియోలో మేకింగ్‌ మాత్రమే చూపించాం. అసలైన డ్యాన్స్‌ చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎనిమిది రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తయింది. 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొన్నారు. కపుల్స్‌ కూడా తేలిగ్గా డ్యాన్స్‌ చేయగలిగేలా హుక్‌ స్టెప్‌ ఉండాలని ముందే ఫిక్స్‌ అయ్యా. దానికి తగ్గట్టే కొరియోగ్రఫీ చేశా. అల్లు అర్జున్‌- రష్మిక తమ డ్యాన్స్‌తో అలరిస్తారు’’ అని పేర్కొన్నారు. అంతకుముందే రిలీజైన టైటిల్‌ సాంగ్‌ ‘పుష్ప.. పుష్ప’ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది.

రాశీఖన్నా ఫొటోషూట్‌ అదిరింది.. సముద్ర తీరాన శ్రీలీల వాకింగ్‌

‘పుష్ప 1’లోని ప్రత్యేక గీతం ‘ఊ అంటావా మావ..’కి కొరియోగ్రఫీ చేసింది గణేశ్‌ ఆచార్యే. ‘పుష్ప 1’ ఘన విజయం అందుకోవడం, అందులోని నటనకుగాను అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంతో పార్ట్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ‘ఊ అంటావా మావ’ను మించేలా ‘పుష్ప 2’లో స్పెషల్‌ సాంగ్‌ ఉండేలా టీమ్‌ సన్నాహాలు చేస్తోంది. అందులో బాలీవుడ్‌ నటి ఆడిపాడే అవకాశాలున్నాయని సమాచారం. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని