Bhagyashree Borse: తొలి సినిమా రాలేదు అప్పుడే మూడో అవకాశం?

‘మిస్టర్‌ బచ్చన్‌’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్న కొత్త అందం భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా ఇంకా విడుదల కాక ముందే వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది భాగ్యశ్రీ.

Published : 12 Jun 2024 01:38 IST

మిస్టర్‌ బచ్చన్‌’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్న కొత్త అందం భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా ఇంకా విడుదల కాక ముందే వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది భాగ్యశ్రీ. ఆమె ఇప్పటికే విజయ్‌ దేవరకొండ -  గౌతమ్‌ తిన్ననూరిల చిత్రంలో నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా తెలుగులో మూడో సినిమాకి కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఓ చిత్రం నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. రవి అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇప్పుడీ సినిమా కోసం నాయికగా భాగ్యశ్రీని ఎంచుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇదొక భిన్నమైన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానుందని.. ఇది ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనుందని ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు