RaviTeja: హరీశ్‌ శంకర్‌ - రవితేజ మూవీ.. కథానాయికగా ‘క్యాడ్‌బరీ’ బ్యూటీ..!

హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) - రవితేజ (Raviteja) కాంబినేషన్‌లో ఇటీవల ఓ సినిమా ఖరారైన విషయం తెలిసిందే. ఆదివారం ఈసినిమా పూజా కార్యక్రమం జరగనుంది. చిత్రబృందం తాజాగా హీరోయిన్‌ను పరిచయం చేసింది.

Published : 16 Dec 2023 20:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు రవితేజ (Raviteja) - హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబినేషన్‌లో ఓ సరికొత్త ప్రాజెక్ట్‌ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఇది నిర్మితం కానుంది. అయితే, ఈ సినిమాలో రవితేజ సరసన కథానాయికగా ఎవరు కనిపించనున్నారనే విషయంలో ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ ప్రచారాలన్నింటికీ పుల్‌స్టాప్‌ పెడుతూ చిత్రబృందం తాజాగా హీరోయిన్‌ ఫొటోని షేర్‌ చేసింది. బాలీవుడ్‌ యువ నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో ప్రధాన పాత్రలో కనిపించనున్నారని తెలిపింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే గురించి గూగులింగ్‌ చేస్తున్నారు.

Social Look: నయన్‌ - విఘ్నేశ్‌ పూజలు.. సంగీత్‌లో పూజ మెరుపులు..!

మోడలింగ్ టు హీరోయిన్‌..!

మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ బోర్సే మోడల్‌గా ఫేమ్‌ సొంతం చేసుకున్నారు. పలు బ్రాండ్స్‌ కోసం ఆమె వాణిజ్య ప్రకటనకర్తగానూ వ్యవహరించారు. క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్‌ సిల్క్‌ చాక్లెట్‌ యాడ్‌ ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘యారియన్‌ 2’ అనే బాలీవుడ్‌ చిత్రంతో భాగ్యశ్రీ నటిగా తెరంగేట్రం చేశారు. ఇందులో ఆమె రాజ్యలక్ష్మి పాత్ర పోషించారు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే ‘యారియన్‌ 2’ విడుదలైంది. ఇందులో భాగ్యశ్రీ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తన నటనతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. హరీశ్‌ శంకర్‌ - రవితేజ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇష్టాయిష్టాల విషయానికి వస్తే.. భాగ్యశ్రీకి ట్రావెలింగ్‌, ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ ఆయా ఫొటోలను తరచూ ఆమె ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని