Bhola Shankar Ott Release: ఎట్టకేలకు ఓటీటీలోకి ‘భోళా శంకర్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

చిరంజీవి (Chiranjeevi) నటించిన సరికొత్త చిత్రం ‘భోళాశంకర్‌’ (Bhola Shankar Ott Release) ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఈసినిమా ఎక్కడ స్ట్రీమింగ్‌ కానుందంటే..?

Updated : 10 Sep 2023 11:56 IST

హైదరాబాద్‌: సోదరి సెంటిమెంట్‌ నేపథ్యంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భోళా శంకర్‌’ (Bhola Shankar ott Release). మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. ఇందులో చిరంజీవి సోదరిగా నటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) కీలక పాత్ర పోషించారు. తమన్నా కథానాయిక. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కాగా, ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 15 నుంచి ఇది సినీ ప్రియులకు అందుబాటులో ఉండనుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

Prabhas: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. శివుడిగా ప్రభాస్‌..?

కథేంటంటే: త‌న సోద‌రి మ‌హాల‌క్ష్మి (కీర్తిసురేశ్‌) చ‌దువు కోసం శంక‌ర్ (చిరంజీవి) కలకత్తా వెళ్తాడు. ఆమెను ఓ కాలేజీలో చేర్పించి.. తాను టాక్సీ డ్రైవ‌ర్‌గా జీవితాన్ని మొద‌లుపెడ‌తాడు. మ‌హాల‌క్ష్మిని చూసి శ్రీక‌ర్ (సుశాంత్‌) ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ ఇద్ద‌రికీ పెళ్లి చేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటూనే, మాన‌వ అక్ర‌మ‌ ర‌వాణాకి పాల్ప‌డుతున్న అలెగ్జాండ‌ర్ (త‌రుణ్ అరోరా) సోద‌రుల్లో ఒక్కొక్క‌రినీ అంతం చేయ‌డం మొద‌లుపెడ‌తాడు శంక‌ర్‌. ఆ విష‌యాన్ని క‌ళ్లారా చూస్తుంది శ్రీక‌ర్ సోద‌రి, క్రిమిన‌ల్ లాయ‌ర్ లాస్య (త‌మ‌న్నా). ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? మాన‌వ అక్ర‌మ ర‌వాణా ముఠాతో శంక‌ర్‌కి ఉన్న వైరం ఏమిటి? అస‌లు శంక‌ర్ గ‌త‌మేమిటి? మ‌హా, శ్రీక‌ర్ జంట పెళ్లి జ‌రిగిందా?లేదా? వంటి ఆసక్తికర అంశాలతో ఇది సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని