Bollywood: 1000 మంది డ్యాన్సర్లతో ఎంట్రీ సాంగ్‌.. ఏ చిత్రంలో అంటే..

కార్తీక్‌ఆర్యన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘భూల్‌ భులయ్యా 3’కు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్‌లో వైరల్‌గా మారింది.

Published : 23 Mar 2024 18:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ హీరో కార్తీక్‌ఆర్యన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘భూల్‌ భులయ్యా 2’ మంచి విజయాన్ని సాధించింది. దీంతో ‘భూల్‌ భులయ్యా 3’తో (Bhool Bhulaiyaa 3) మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది చిత్రబృందం. ప్రస్తుతం దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త బీటౌన్‌లో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం హీరో ఎంట్రీ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందట. గణేశ్‌ ఆచార్య కొరియోగ్రఫీలో ఇది తెరకెక్కుతోందని టాక్‌. అందులో 1000 మంది డ్యాన్సర్లు కనిపించనున్నారని.. ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఇలాంటి పాట చిత్రీకరణ జరగలేదని సమాచారం. దీనికోసం కార్తీక్‌ ఆర్యన్‌ రెండు వారాలుగా ప్రిపేర్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భూల్‌ భులయ్యా 3’ ప్రేక్షకులకు విజువల్ వండర్‌లా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఊహకు కూడా అందవు. నేను ఇంత భారీ చిత్రంలో ఇప్పటివరకు నటించలేదు. ఈ అద్భుతమైన ప్రయాణానికి మీ దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. దీంతో కార్తీక్‌ చెప్పింది ఆ పాట గురించే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

అనీస్‌ బజ్మీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కార్తీక్‌ (Kartik Aaryan) సరసన త్రిప్తి దిమ్రీ నటిస్తుండగా.. విద్యాబాలన్‌, మాధురీ దీక్షిత్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని