Bobby Deol: ఆ పాత్ర నా కంఫర్ట్‌ జోన్‌లో లేదు..: సూర్య సినిమాపై బాబీ దేవోల్‌

సూర్య  హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా  ‘కంగువా’ (Kanguva). ఈ సినిమాలోని తన పాత్ర గురించి బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol) ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Published : 12 Dec 2023 12:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యానిమల్‌’తో సూపర్‌ హిట్‌ అందుకున్నారు నటుడు బాబీ దేవోల్‌. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో రెండు భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. అలాగే సూర్య (Suriya) హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కంగువా’లోనూ విలన్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రపై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు బాబీ దేవోల్‌.

‘‘కంగువా’ చిత్రబృందం నాకెంతో నచ్చింది.  సూర్య నటన అద్భుతంగా ఉంటుంది. అలాంటి అంకితభావం ఉన్న నటుడితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇది నాకు తొలి తమిళ సినిమా. ఇప్పటి వరకు నేను ఇలాంటి పాత్రలో నటించలేదు. ఈ సినిమాలో నేను చేస్తున్న పాత్ర నా కంఫర్ట్‌ జోన్‌లో లేదు. ఎందుకంటే నాకు ఈ భాష తెలియదు. రెండు నెలల్లో తమిళం నేర్చుకోలేను’ అని అన్నారు.

రహస్యాలు అడగొద్దు.. నేను అబద్ధాలే చెబుతాను : అనన్యతో డేటింగ్‌పై ఆదిత్యరాయ్‌ కామెంట్‌

ఇక ‘కంగువా’ విషయానికొస్తే.. శివ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఏకంగా 38 భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్‌లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈసినిమా సిద్ధమవుతోంది. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా.. జగపతి బాబు, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఇది విడుదల కానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీని గురించి నిర్మాత మాట్లాడుతూ.. వసూళ్ల విషయంలో సినిమా లక్ష్యం రూ.1000 కోట్లని పేర్కొన్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని