రహస్యాలు అడగొద్దు.. నేను అబద్ధాలే చెబుతాను : అనన్యతో డేటింగ్‌పై ఆదిత్యరాయ్‌ కామెంట్‌

అనన్య పాండేతో (Ananya Panday) డేటింగ్ గురించి ఆదిత్యరాయ్‌ కపూర్‌ను కరణ్‌ జోహార్‌ ప్రశ్నించారు. కాఫీ విత్‌ కరణ్ సీజన్‌ 8 తాజా ఎపిసోడ్‌లో ఆయన పాల్గొన్నారు.

Published : 12 Dec 2023 10:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే (Ananya Panday), ఆదిత్యరాయ్‌ కపూర్‌ (adityaroy kapur) మధ్య ప్రేమ వ్యవహారంపై వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆదిత్యను కరణ్‌ జోహార్‌ ప్రశ్నించారు. కాఫీ విత్‌ కరణ్ సీజన్‌ 8లో అర్జున్‌ కపూర్‌తో పాటు ఆయన పాల్గొన్నారు. తాజాగా దీని ప్రోమో విడుదలైంది.

‘అనన్యతో నువ్వు డేటింగ్‌ చేస్తున్నావని రూమర్స్‌ వస్తున్నాయి. నీ సమాధానం కోసం అంతా ఎదురుచూస్తున్నారు’ అని కరణ్‌ అడిగారు. దీంతో ‘మీరు నన్ను రహస్యాలు అడగొద్దు.. నేను కచ్చితంగా అబద్ధాలే చెబుతాను. దయచేసి మరో ప్రశ్న అడగండి’ అంటూ ఆదిత్య సరదాగా స్పందించారు. ఇక గత నెలలో ఇదే షోలో అనన్య కూడా హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. రిలేషన్‌షిప్‌ గురించి ఆమె మాట్లాడుతూ.. ఆదిత్య తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ఇక ఈ ఎపిసోడ్‌ డిసెంబర్ 14న డిస్నీ+హాట్ స్టార్‌ వేదికగా ప్రసారం కానుంది.

ఆ విషయంలో ఏకైక భారతీయ నటుడు.. రజనీకాంత్‌ బర్త్‌డే స్పెషల్‌

ఇక ఈ జంట తమ ప్రేమ వ్యవహారాన్ని బయట చెప్పలేదు కానీ.. ఇండస్ట్రీలో ఏ పార్టీ జరిగినా ఇద్దరూ కలిసే హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన దీపావళి పార్టీలోనూ వీళ్లిద్దరూ మెరిశారు. దీంతో ఈ రూమర్లు ఎక్కువయ్యాయి. ఇక ఆదిత్య, అనన్య ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. అనన్య పాండే  ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’ (Dream Girl 2) ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని