Bobby Deol: ఇంతటి విజయాన్ని ఊహించలేదు.. ఆయన నా జీవితాన్ని మార్చేశారు : బాబీ దేవోల్‌

‘యానిమల్‌’లో తన పాత్ర నిడివి గురించి బాబీ దేవోల్ (Bobby Deol) మాట్లాడారు. సందీప్‌ వంగా తన జీవితాన్ని మార్చినట్లు తెలిపారు.

Updated : 08 Dec 2023 15:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తాజా బ్లాక్‌ బస్టర్‌ ‘యానిమల్‌’ (Animal) సినిమాతో జోష్‌ మీద ఉన్నారు నటుడు బాబీ దేవోల్‌. సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన విలన్‌గా ఆకట్టుకున్నారు. తాజాగా ఆంగ్ల మీడియాతో బాబీ దేవోల్‌ మాట్లాడుతూ తన పాత్ర నిడివిపై వస్తోన్న కామెంట్స్‌ గురించి స్పందించారు.

‘‘దర్శకుడు నాకు పాత్ర గురించి చెప్పి 15 రోజుల షూటింగ్‌ మాత్రమే ఉంటుందని చెప్పారు. నిడివి తక్కువ అయినా కథ పరంగా ప్రాధాన్యమున్న పాత్ర అది. నాకు ఎంతో సవాలుగా అనిపించింది. ఈ స్థాయిలో విజయాన్ని మాత్రం ఊహించలేదు. నటనకు ఆస్కారమున్న పాత్ర దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారంతా నేను ఇంకా ఎక్కువ సమయం కనిపిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటుడిగా ఇది నాకు ప్రశంసతో సమానం. కానీ, సినిమాలో మన పాత్ర నిడివి కంటే దాని ప్రభావం ఎంత అనేది ముఖ్యం. సందీప్‌ వంగాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సినిమాతో ఆయన నా జీవితాన్ని మార్చేశారు’’అని చెప్పారు. ఇక ఈ సినిమా విజయంపై బాబీ దేవోల్‌ గతంలోనూ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.

యశ్‌ కొత్త సినిమా టైటిలిదే.. రిలీజ్‌ ఎప్పుడంటే!

డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సొంతం చేసుకుంటోంది. మొదటి వారం రూ.563 కోట్లు(గ్రాస్‌) రాబట్టినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ వీకెండ్‌ అది మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు