Yash19: యశ్‌ కొత్త సినిమా టైటిలిదే.. రిలీజ్‌ ఎప్పుడంటే!

హీరో యశ్‌ (Yash) కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చేసింది. ఓ ప్రత్యేక వీడియోతో దీని వివరాలను నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Updated : 08 Dec 2023 11:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యశ్‌ (Yash) కొత్త సినిమా అప్‌డేట్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఓ ప్రత్యేక వీడియోతో దీని వివరాలను ప్రకటించారు. ఈ చిత్రాన్ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ (Geetu Mohandas) తెరకెక్కించనున్నట్లు తెలుపుతూ విడుదల తేదీని కూడా పంచుకున్నారు.

త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్‌

యశ్‌ 19వ (yash19) సినిమాగా రానున్న దీనికి ‘టాక్సిక్‌’ (Toxic) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న యశ్‌.. ‘నువ్వు వెతుకుతున్నది.. నిన్ను కోరుకుంటోంది’ అనే క్యాప్షన్‌ రాశారు. ఇక ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌10న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇది పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మించనున్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన కథగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘కేజీఎఫ్‌’ లాంటి భారీ హిట్‌ ప్రాజెక్ట్‌ తర్వాత యశ్‌ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. అందరూ గర్వపడేలా తన తర్వాతి సినిమా ఉంటుందని యశ్‌ ఇటీవల తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని