Salaa 2: ‘సలార్‌ 2’లో ఆ ఫీల్‌ వందరెట్లు అధికంగా ఉంటుంది: బాబీ సింహా

సలార్‌2 అంచనాలకు మించి ఉంటుందని బాబా సింహా ఇచ్చిన స్టేట్‌మెంట్ వైరల్‌ అవుతోంది.

Published : 16 Mar 2024 14:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas)  హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘సలార్‌’ (Salaar). పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, బాబీ సింహా, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబరులో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సలార్‌ 2: శౌర్యాంగ పర్వం’ (Salaa 2 - Shouryaanga Parvam) తెరకెక్కనుంది. దీనికి సంబంధించి అప్‌డేట్‌ కోసం అభిమానులు, సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాబీ సింహా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘సలార్‌ క్లైమాక్స్‌ లాస్ట్‌ 10 నిమిషాలు ప్రేక్షకులకు గూజ్ బంప్స్‌ వచ్చాయి.  పార్ట్‌ 2లో ఆ ఫీల్‌ 100 రెట్లు అధికంగా ఉంటుంది. ఆశ్చర్యపోయే క్లైమాక్స్‌ను సిద్ధం చేశారు. నేను కూడా ప్రశాంత్‌ నీల్‌ షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురుచూస్తున్నా’’ అని బాబీ సింహా వెల్లడించారు. 

ప్రస్తుతం ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో నాగ్‌ అశ్విన్‌ దీనిని రూపొందిస్తున్నారు. దీపికా పదుకొణె కథానాయిక. కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మారుతీ దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ లోనూ ప్రభాస్ నటిస్తున్నారు. రొమాంటిక్‌ హారర్‌ కామెడీగా ఇది తెరకెక్కుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని