Animal: ‘యానిమల్‌’.. ఎంజాయ్‌ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్‌ దర్శకుడు

‘యానిమల్‌’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు.

Published : 24 Apr 2024 17:51 IST

ముంబయి: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). తాజాగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌. సినీప్రియుల నుంచి దీనికి విశేష ఆదరణ రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘‘యానిమల్‌’పై నేనింకా ఒక కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నా. ఎందుకంటే, ఆ చిత్రాన్ని చూసినంతసేపు ఎంజాయ్‌ చేశా. అదేవిధంగా అసహ్యించుకున్నా. హింస, ద్వేషం, ఇష్టం.. ఇలా అన్నిరకాల ఎమోషన్స్‌ ఇందులో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో విడుదలైన సూపర్‌హిట్‌ మూవీ ఇది. ప్రేక్షకులు ఇప్పటికీ దీనిని వీక్షించడమే కాకుండా ఇలాంటివాటిని చూడటానికే ఇష్టపడుతున్నారు.  ప్రేక్షకులు దీనిని ఎక్కువగా ఇష్టపడుతుండటం ఆశ్చర్యంగా ఉంది’’ అన్నారు.

తండ్రీ తనయుల సెంటిమెంట్‌తో ‘యానిమల్‌’ సిద్ధమైంది. రష్మిక కథానాయిక. అనిల్‌కపూర్‌, బాబీదేవోల్‌, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.920 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇది తీవ్ర హింసను ప్రోత్సహించడం ఏం బాలేదంటూ గతంలో పలువురు బాలీవుడ్‌ దర్శక - నిర్మాతలు, రచయితలు విమర్శలు చేశారు. ‘యానిమల్‌’కు కొనసాగింపుగా ‘యానిమల్‌ పార్క్‌’ రానుంది. ‘‘యానిమల్‌ పార్క్‌’ చిత్రీకరణను 2026లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మొదటిభాగం కన్నా మరింత భారీగా.. హింసాత్మకంగా.. ప్రేక్షకుల ఊహాలకు అందని యాక్షన్‌ సన్నివేశాలతో దీన్ని తీర్చిదిద్దుతున్నా’’ అని ఇటీవల  ఓ ఇంటర్వ్యూలో సందీప్‌రెడ్డి వంగా తెలిపారు. 2023లో విడుదలైన ‘ఖూఫియా’తో విశాల్‌ విజయాన్ని అందుకున్నారు. గతంలో ఆయన ‘రంగూన్‌’, ‘హైడర్‌’, ‘బ్లడ్‌ బ్రదర్స్‌’, ‘ఓంకార’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని