Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ స్పెషల్‌ వీడియో.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌ రూపొందించిన ప్రత్యేక వీడియో త్వరలో విడుదల కానుంది.

Published : 27 May 2024 21:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ప్రభాస్‌.. భైరవగా నటించిన ఈ చిత్రంలో ‘బుజ్జి’ అనే వాహనం కీలకంగా నిలవనుంది. ఈ అధునాతన వెహికల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు చిత్ర బృందం ఇటీవల ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో, బుజ్జితో భైరవ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకునేందుకు మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ‘కల్కి’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘బుజ్జి అండ్‌ భైరవ’ (Bujji And Bhairava) పేరుతో రూపొందించిన ప్రత్యేక వీడియో ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని తెలిపింది. చిన్నారులకు వినోదం పంచే ఉద్దేశంతో దాన్ని రూపొందించినట్టు తాజాగా విడుదలైన విడుదైన గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతోంది. ఆ స్పెషల్‌ వీడియోలో ఏయే అంశాలు ఉన్నాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

భారీ టైర్లు.. ఆరు టన్నుల బరువు.. ‘బుజ్జి’ కారు విశేషాలు తెలుసా?

ఇతిహాసాలతో ముడిపడిన ఈ భారీ బడ్జెట్‌ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan), దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటానీ (Disha Patani) కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని