Captain Miller: నెల రోజులు కాకముందే ఓటీటీలోకి ‘కెప్టెన్‌ మిల్లర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ధనుష్‌ (Dhanush) నటించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller) మరికొన్ని రోజుల్లో ఓటీటీలో స్ట్రీమ్‌ కానుంది.

Updated : 02 Feb 2024 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ధనుష్‌ (Dhanush) హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయిక. సందీప్‌ కిషన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్‌లో రిలీజై మిశ్రమ స్పందన అందుకుంది. నెల రోజులైనా కాకముందే ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెడుతోంది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

Chiranjeevi: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన రచయిత చిన్నికృష్ణ

కథేంటంటే: దేశంలో స్వాతంత్ర్యోద్య‌మం కొన‌సాగుతున్న 1930 ద‌శ‌కం అది. శివ‌న్న (శివ‌రాజ్‌ కుమార్‌) స్వ‌రాజ్యం కోసం పోరాటం చేస్తుంటే.. అత‌ని తమ్ముడు అగ్నీశ్వ‌ర అలియాస్ అగ్ని (ధ‌నుష్‌) బ్రిటిష్ సైన్యంలో చేరాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. అందుకు కారణం.. ఊరిలో కుల వివ‌క్ష‌తో అవ‌మానాలు ఎదుర్కోవ‌డ‌మే. సైన్యంలో చేరాక అగ్నికి బ్రిటిష‌ర్లు ‘కెప్టెన్ మిల్లర్’ అని పేరు పెడతారు. శిక్ష‌ణ పూర్త‌యిన వెంట‌నే జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌తో అత‌డి ప్ర‌యాణం మ‌లుపు తిరుగుతుంది.

తన పైఅధికారిని చంపేసి అక్క‌డి నుంచి త‌ప్పించుకుని వెళ్లిపోతాడు. అందుకు తోటి సైనికుడు అయిన రఫీక్ (సందీప్ కిషన్) సాయం చేస్తాడు. బ్రిటిష్ సైన్యం నుంచి బ‌య‌టికొచ్చాక అగ్ని ఓ దొంగ‌గా మార‌తాడు. త‌న ఊళ్లో ఉన్న చరిత్రాత్మ‌క ఆల‌యంలో విగ్ర‌హాన్ని చోరీ చేస్తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? ఆ విగ్ర‌హాన్ని అగ్నీశ్వ‌ర దొంగ‌త‌నం చేయ‌డానికి కార‌ణమేంటి? ఊరిపై దండెత్తిన బ్రిటిష్ సైన్యంపై అగ్ని ఎలా పోరాటం సాగించాడ‌నే అంశాలతో సినిమా సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని