Chiranjeevi: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన రచయిత చిన్నికృష్ణ

స్టార్‌ హీరో చిరంజీవికి సినీ రచయిత చిన్నికృష్ణ క్షమాపణలు చెప్పారు.

Updated : 02 Feb 2024 12:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ రచయిత చిన్నికృష్ణ అగ్ర కథానాయకుడు చిరంజీవికి (Chiranjeevi) క్షమాపణలు చెప్పారు. గతంలో కొందరి ఒత్తిడి కారణంగా ఆయనపై దుర్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందని వీడియో విడుదల చేశారు.

‘చిరంజీవి గారికి పద్మవిభూషణ్‌ వచ్చిందని తెలిసి ఎంతో ఆనందించా. వాళ్ల ఇంటికెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను. అందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారు. నేనూ చేశాను. నాపై నమ్మకంతో ‘ఇంద్ర’లో నాకు అవకాశమిచ్చారు.  అయితే.. గతంలో ఆయనపై నోటికొచ్చినట్లు మాట్లాడాను. దీంతో  నా కుటుంబసభ్యులు, స్నేహితులు నాపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ క్షణం నుంచి ప్రతిరోజు నేను భగవంతుడి దగ్గర క్షమాపణలు కోరుతూనే ఉన్నాను. నాలో నేను ఎంతో బాధపడ్డాను. తాజాగా చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నా కుటుంబం బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నా వృత్తిగత జీవితం ఎలా ఉందని అడిగారు. ఇవన్నీ చూశాక ఇలాంటి వ్యక్తి గురించా నేను తప్పుగా మాట్లాడింది అని పశ్చాత్తాపపడి క్షమించమని అడిగాను.’

‘గుండు.. ఎటు వెళ్లిపోయావ్‌?’: నెటిజన్‌ కామెంట్‌పై ‘ఓయ్‌’ దర్శకుడు ఏమన్నారంటే?

‘‘ఏమైనా కథలు ఉంటే కలిసి పనిచేద్దాం’ అని చిరంజీవి అన్నారు. ఈసారి మీతో చేయబోయే సినిమా దేశమంతా గుర్తుంచుకునేలా ఉంటుంది అన్నయ్య. అంత గొప్ప కథ రాస్తాను. మీరు మరెన్నో అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చే జన్మంటూ ఉంటే మీ తమ్ముడిగా పుట్టాలని కోరుకుంటా’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని