Hema: రేవ్‌ పార్టీ కేసు.. నటి హేమకు మరోసారి నోటీసులు

సినీ నటి హేమకు సీసీబీ పోలీసు మరోసారి నోటీసులు జారీ చేశారు.

Published : 29 May 2024 22:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరు రేవ్‌ పార్టీ (Bengaluru Rave Party) కేసుకు సంబంధించి సీసీబీ పోలీసులు నటి హేమ (Hema)కు మరోసారి నోటీసులు జారీ చేశారు. తాజాగా జూన్‌ 1న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇంతకముందు ఆమెకు నోటీసులు జారీ చేయగా.. తనకు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని, విచారణకు రాలేనని హేమ చెప్పారు. దీంతో ఆమెతో పాటు మరో 8 మంది నిందితులకు తాజాగా నోటీసులు ఇచ్చారు.

రేవ్‌ పార్టీలో పట్టుబడిన వారిలో 103 మందికి డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. పలువురు నటుల రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని