Allu Arjun: అల్లు అర్జున్‌కు శుభాకాంక్షల వెల్లువ.. ‘పుష్ప 2’ టీజర్‌పై చిరు ఏమన్నారంటే!

పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్‌కు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘పుష్ప2’ సెట్‌లో ఇప్పటివరకు ఎవరూ చూడని ఫొటోతో రష్మిక విషెస్‌ చెప్పారు.

Updated : 08 Apr 2024 18:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు విషెస్‌ చెబుతున్నారు. ఈసందర్భంగా విడుదల చేసిన ‘పుష్ప2’ టీజర్‌ సోషల్‌ మీడియాలో మిలియన్ల వ్యూస్‌తో సందడి చేస్తోంది. బన్నీకి శుభాకాంక్షలు చెప్పిన అగ్ర కథానాయకుడు చిరంజీవి.. ఈ టీజర్‌ అద్భుతంగా ఉందని..పుష్పరాజ్‌ రూల్‌ చేస్తాడన్నారు. ఈ పోస్ట్‌కు రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్‌.. ‘థ్యాంక్యూ సో మచ్‌. టీజర్‌ను మీరు ప్రశంసించడం ఆనందాన్నిచ్చింది. ఎంతో థ్రిల్‌గా ఉంది’ అని రాసుకొచ్చారు. అలాగే, పుష్పరాజ్‌కు శుభాకాంక్షలు అంటూ ఇప్పటివరకు ఎవరూ చూడని అల్లు అర్జున్‌ స్టిల్‌ ఫొటోను షేర్‌ చేశారు రష్మిక.

  • పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ. రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నావు. ఈ ఏడాది నీకు రెట్టింపు సంతోషాన్నివ్వాలని కోరుకుంటున్నా - సాయి ధరమ్‌ తేజ్
  • ‘పుష్ప2’ టీజర్‌ వావ్‌ అనిపించేలా ఉంది. సుకుమార్‌కు మాత్రమే ఇలా తీయడం సాధ్యం. బన్నీ దానికి మరింత పవర్‌ను ఇచ్చాడు. హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌ - నాని
  • ఐకాన్‌ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ప్రత్యేకతతో స్క్రీన్‌పై అద్భుతాలు చేయండి - దర్శకుడు వశిష్ఠ
  • మీ శ్రద్ధ, నిబద్ధతతో పాటు.. మీ యాక్టింగ్‌ మమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మీ అసాధారణ ప్రతిభతో జాతీయ అవార్డును సొంతం చేసుకుని మేమంతా గర్వపడేలా చేశారు. ఈ ఏడాదంతా మరిన్ని విజయాలు వరించాలి. ‘పుష్ప2’ టీజర్‌ అదిరిపోయింది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా - దర్శకుడు శ్రీను వైట్ల.
  • నాకెంతో ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా - రకుల్‌ ప్రీత్ సింగ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని