Silk Smitha: సిల్క్‌ స్మిత బయోపిక్‌.. హీరోయిన్‌గా ఎవరంటే..?

సిల్క్‌ స్మిత (Silk Smita) జీవితాన్ని ఆధారంగా చేసుకుని నూతన దర్శకుడు జయరామ్‌ ఓ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది.

Updated : 02 Dec 2023 13:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అలనాటి నటి సిల్క్‌ స్మిత (Silk Smitha) జీవితాన్ని ఆధారంగా చేసుకుని మరో బయోపిక్‌ రానుంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఇది తెరకెక్కుతోంది. చంద్రికా రవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని జయరామ్‌ అనే నూతన దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. ‘సిల్క్‌ స్మిత ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ పేరుతో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం సిల్క్‌ స్మిత జయంతిని పురస్కరించుకుని చిత్రబృందం తాజాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో చంద్రిక.. స్మితలా కనిపించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన పోస్టర్‌ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Salaar: 114 రోజుల్లోనే ‘సలార్’ను పూర్తిచేశాం.. ఆసక్తికర విషయాలు పంచుకున్న ప్రశాంత్ నీల్‌

గ్లామరస్‌ తారగా వెండితెరపై కొంతకాలంపాటు ఓ వెలుగు వెలిగారు సిల్క్‌ స్మిత. అలనాటి స్టార్‌ హీరోల సినిమాల్లో ఎన్నో ఐటెమ్‌ సాంగ్స్‌ చేశారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో చేదు సంఘటనలు ఎదుర్కొన్న ఆమె 1996 సెప్టెంబర్‌ 23న ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో ‘డర్టీ పిక్చర్‌’ తెరకెక్కింది. సిల్క్‌స్మితగా విద్యాబాలన్‌ యాక్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక, చంద్రికా రవి విషయానికి వస్తే.. ‘వీర సింహారెడ్డి’లో ఓ స్పెషల్‌ సాంగ్‌తో గుర్తింపు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని