ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ పురస్కారంతోనే సముచిత గౌరవం: చిరంజీవి

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ (NTR) జయంతి సందర్భంగా ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) నివాళులర్పించారు.

Updated : 28 May 2024 11:30 IST

హైదరాబాద్‌: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ (NTR) జయంతి సందర్భంగా ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) నివాళులర్పించారు. ఆయన కీర్తి భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. ఈ మేరకు ఎన్టీఆర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. 

‘‘కొందరి కీర్తి అజరామరం.. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తుచేసుకుంటున్నాను. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలకు ‘భారతరత్న’ పురస్కారం సముచిత గౌరవమని భావిస్తున్నాను. తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

తాజా వార్తలు (Latest News)

మరిన్ని

సుఖీభవ

చదువు