Pawan Kalyan: మనల్ని ఎవడ్రా ఆపేది?: పవన్‌ కల్యాణ్‌కు శుభాకాంక్షల వెల్లువ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలుపుపై పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 04 Jun 2024 18:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ పడిలేచిన కెరటం. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒకానొక సమయంలో వరుస ఫ్లాప్‌ల్లో ఉన్నా అభిమానులు, సినీ ప్రియుల్లో ఆయనకు క్రేజ్‌ తగ్గలేదు. అలా అని ఆయన ఊరుకోలేదు. రెట్టింపు ఉత్సాహంతో నటించి, ఫ్యాన్స్‌ మళ్లీ కాలర్‌ ఎగరేసుకునేలా చేశారు. పాలిటిక్స్‌లోనూ అంతే. ఎన్నో ఒడుదొడుకులు తట్టుకుని నిలబడ్డారు. అనుకున్నది సాధించారు. 2024 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram Assembly constituency) నుంచి పోటీ చేసిన ఈ జనసేనాని విజయకేతనం ఎగరేశారు. 69,169 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి వంగా గీతపై గెలుపొందారు. ఈ సందర్భంగా హీరోలు, నిర్మాతలు, దర్శకులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు, కూటమి విజయంలో పవన్‌ పాత్ర కీలకంకావడంతో తెదేపా వర్గాలూ ఆయన్ను అభినందిస్తున్నాయి. దీంతో, #PawanKalyan హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌ (ట్విటర్‌)లో ట్రెండింగ్‌లో నం.1 స్థానంలో నిలిచింది.

హార్ట్‌ టచింగ్‌: అల్లు అర్జున్‌

‘‘అద్భుతమైన విజయాన్ని అందుకున్న పవన్‌ కల్యాణ్‌ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రజలకు సేవ చేయడంలో మీరు పడే శ్రమ, మీ అంకితభావం, నిబద్ధత ఎప్పుడూ హార్ట్‌ టచింగ్‌గా ఉంటాయి. మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు’’ అని పవన్‌ కుటుంబ సభ్యుడు, హీరో అల్లు అర్జున్‌ ట్వీట్‌ పెట్టారు.

అదొక పాఠం: నాని

‘‘ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్‌ హీరో పవన్‌ కల్యాణ్‌గారికి శుభాకాంక్షలు. మీరు చేసిన పోరాటం, విజయాన్ని దక్కించుకున్న తీరు ఓ కథ మాత్రమే కాదు ఇదొక పాఠం. దాన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది సర్‌. మీరు మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని హీరో నాని పేర్కొన్నారు. 

లవ్‌ యూ బాబాయ్‌: వరుణ్‌ తేజ్‌

‘‘ఏపీ 2024 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన జనసేనానికి కంగ్రాట్స్‌.  మీ హార్డ్‌ వర్క్‌, నమ్మకం సక్సెస్‌కు దోహదపడ్డాయి. రాజకీయ ప్రయాణంలో మీకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. లవ్‌ యూ బాబాయ్‌ ఫ్రమ్‌ అబ్బాయ్‌’’ అని వరుణ్‌ తేజ్‌ పోస్ట్‌ పెట్టారు. 

చెప్పాడు.. చేశాడు: సాయి ధరమ్‌ తేజ్‌

‘‘జగన్‌ గుర్తుపెట్టుకో.. నిన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్‌ కల్యాణ్‌ కాదు.. మా పార్టీ జనసేనే కాదు’’ అంటూ గతంలో పవన్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో పోస్ట్‌ చేశారు ఆయన కుటుంబసభ్యుడు, హీరో సాయి ధరమ్‌ తేజ్‌. ‘చెప్పాడు.. చేశాడు. మనల్ని ఎవడ్రా ఆపేది’’ అని దానికి క్యాప్షన్‌ పెట్టారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఇప్పుడు సేఫ్‌గా ఉంది’’ అంటూ ఓ ఫొటోకు వ్యాఖ్యను జోడించారు.

ఎప్పటికీ ‘పవర్‌’ స్టారే: నితిన్‌

‘‘ప్రియమైన పవన్‌ కల్యాణ్‌ గారు.. మీరు చరిత్రాత్మక విజయం సాధించడం, కూటమిని అగ్రగామిగా నిలపడంపై ఓ అభిమానిగా, ఓ సోదరుడిగా ఎంతగానో ఆనందిస్తున్నా. ఈ సక్సెస్‌కు మీరు అర్హులు. మీరు ఎప్పటికీ మాకు ‘పవర్‌’ స్టారే’’ అని హీరో నితిన్‌ అన్నారు.

ది గేమ్‌ ఛేంజర్‌: కార్తికేయ

‘‘కంగ్రాట్స్‌ పవర్‌ స్టార్‌. సారీ ‘పిఠాపురం ఎం.ఎల్‌.ఎ’, ‘ది గేమ్‌ ఛేంజర్‌’ పవన్‌ కల్యాణ్‌ సర్‌. నిజాయతీతో కూడిన మీ ప్రయాణం, కష్టం మా అందరికీ స్ఫూర్తి. కొత్త రోల్‌లో మిమ్మల్ని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని హీరో కార్తికేయ ట్వీట్‌ చేశారు.

  • పవన్‌కు వీరాభిమాని అయిన దర్శకుడు హరీశ్‌ శంకర్‌.. ‘‘అప్పుడే అయిపోందనుకోకు. ఇప్పుడే మొదలైంది.. ఇప్పుడే మొదలైంది’’ (గబ్బర్‌ సింగ్) డైలాగ్‌ విజువల్స్‌ పోస్ట్‌ చేశారు. 
  • ‘‘పవన్‌ కల్యాణ్‌. ది ‘ఓజీ’. ప్రతి రంగంలో’’ - నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని