Rajamouli - david Warner: రాజమౌళి డైరెక్షన్‌లో వార్నర్‌.. నవ్వులు పూయిస్తున్న కొత్త యాడ్‌

రాజమౌళి, డేవిడ్‌ వార్నర్‌ కలిసి నటించిన ఓ ప్రకటన నవ్వులు పూయిస్తోంది. క్రెడ్‌ యాప్‌ ప్రకటనలో భాగంగా వీరిద్దరూ కలిసి నటించారు.

Updated : 12 Apr 2024 19:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (Rajamouli), ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) కలిసి నటించిన ఓ ప్రకటన నవ్వులు పూయిస్తోంది. క్రెడ్‌ యూపీఐ ప్రమోషన్‌ (CRED UPI) యాడ్‌లో భాగంగా వీరిద్దరూ కలసి నటించారు. ఇందులో రాజమౌళి దర్శకుడి అవతారంలో కనిపించగా.. డేవిడ్‌ వార్నర్‌ మాత్రం తన యాక్టింగ్‌తో నవ్వులు పూయించాడు. ఇప్పుడీ యాడ్‌ అటు సినీ, క్రికెట్‌ ప్రేమికులను అలరిస్తోంది.

‘వార్‌ 2’లో ఎన్టీఆర్‌ లుక్‌ ఇదేనా!

‘‘టికెట్లపై డిస్కౌంట్‌ కావాలంటే ఏం చేయాలి’’ అంటూ రాజమౌళి డేవిడ్‌ వార్నర్‌ను ఫోన్‌లో సంప్రదించడంతో ప్రకటన మొదలవుతుంది. దానికి వార్నర్‌ క్రెడ్‌ను వినియోగించాలని సూచిస్తాడు. ‘ఇంకో మార్గం లేదా?’ అంటూ రాజమౌళి అడగ్గా.. ‘తనకు ఫేవర్‌ చేయాలని వార్నర్‌ అంటాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. రాజమౌళి రూపొందించిన చిత్రాల్లోని పాత్రల్లో వార్నర్‌ నటిస్తే ఎలా ఉంటుందో అందులో చూపించారు. మధ్య మధ్యలో ‘ఆస్కార్‌ వేదికగా కలుద్దాం’.. ‘గుర్రానికి బదులు కంగారు లేదా?’ అంటూ వార్నర్‌ చేత పలికించిన సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి. కొన్నిసార్లు ఫేవర్‌ కూడా మార్కెట్‌ రిస్క్‌కు లోబడి ఉంటాయంటూ ఈ యాడ్‌ను క్రెడ్‌ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని