Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్‌ అసహనం

భారీ వర్షాలతో చెన్నై అతలాకుతమైన నేపథ్యంలో హీరో స్పందించారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌పై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Published : 05 Dec 2023 02:11 IST

చెన్నై: మిగ్‌జాం తుపానుతో (Michaung Cyclone) తమిళనాడు రాజధాని చెన్నైలోని రోడ్లన్నీ చెరువును తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు (Chennai Rains) జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ పరిస్థితిపై హీరో విశాల్‌ స్పందించారు. విపత్తు సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) విఫలమైందంటూ విశాల్‌ (Vishal) ఆరోపించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

కొట్టుకుపోయిన కార్లు.. రన్‌వేపైకి వరద.. చెన్నైలో వర్ష బీభత్స దృశ్యాలు

‘‘డియర్‌ ప్రియా రాజన్‌ (చెన్నై మేయర్‌), జీసీసీ కమిషనర్‌, సంబంధిత అధికారులకు.. మీరంతా మీ కుటుంబాలతో క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా. వరదల సమయంలో పారే డ్రైనేజీ నీరు మీ ఇళ్లలోకి రాదనుకుంటున్నా. మీ ఇళ్లకు నిరంతర విద్యుత్తు, ఆహారం సరఫరా ఉంటుంది. ఓటరుగా ఇదే నగరంలో నివసిస్తున్న మేమంతా ఆ పరిస్థితిలో లేం. వరద నీటి కాలువ ప్రాజెక్ట్ మొత్తం సింగపూర్ కోసమా? లేదా చెన్నై కోసం ఉద్దేశించిందా? 2015లో చెన్నైలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అప్పుడు మేం సహాయం చేశాం. కానీ ఎనిమిదేళ్ల తర్వాత కూడా  అంతకు మించిన దారుణమైన పరిస్థితి కనబడటం దయనీయం. మేం ఈ సమయంలో కూడా కచ్చితంగా ఆహార సామగ్రి, తాగునీరు వంటి సాయం చేస్తూనే ఉంటాం. అలాగే, ఇలాంటి సమయంలో ప్రతి నియోజకవర్గానికి చెందిన ప్రతినిధులు బయటకు వచ్చి అవసరమైన సాయం చేసేందుకు వస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని