Daniel Balaji: నటుడు డేనియల్‌ బాలాజీ మృతి

వెండితెరపై ప్రతినాయకుడి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు డేనియల్‌ బాలాజీ(48) గుండెపోటుతో శుక్రవారం రాత్రి చెన్నైలో మరణించారు.

Updated : 31 Mar 2024 13:42 IST

వెండితెరపై ప్రతినాయకుడి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు డేనియల్‌ బాలాజీ(48) గుండెపోటుతో శుక్రవారం రాత్రి చెన్నైలో మరణించారు. ఆయన అసలు పేరు బాలాజీ కాగా బుల్లితెరపై తమిళ ధారావాహిక ‘చిత్తి’లో ఆయన పోషించిన డేనియల్‌ అనే పాత్ర ఇంటి పేరుగా మారింది. అదే తెర పేరుగానూ స్థిరపడింది. తమిళ, మలయాళ, కన్నడ, తెలుగులో పలు చిత్రాల్లో నటించారాయన. ‘రాఘవన్‌’, ‘బిగిల్‌’, ‘భైరవ’, ‘కాఖా కాఖా’ లాంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ‘సాంబ’, ‘ఘర్షణ’, ‘చిరుత’, ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘టక్‌ జగదీశ్‌’ తదితర చిత్రాల్లో నటించారు. చెన్నైలో నివసిస్తున్న ఆయనకు శుక్రవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘‘డేనియల్‌ హఠాన్మరణానికి చింతిస్తున్నాము. ఇంత చిన్న వయసులో ఆయన మరణించడం ఎంతో బాధాకరం’’అని కమల్‌హాసన్‌తో పాటు పలువురు సినీప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.

చెన్నై, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని